నగ్నంగా రోడ్డుపై బెంగుళూరు గర్ల్స్ డ్రీమ్ బాయ్(ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా కథ, సన్నివేశం డిమాండ్ చేస్తే ఎలాంటి పనులు చేయడానికైనా స్టార్స్ వెనకాడటం లేదు. కథ డిమాండ్ చేస్తే హీరోయిన్లతో పాటు కొన్ని సందర్భాల్లో హీరోలు కూడా నగ్నంగా నటించడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా బెంగుళూరు గర్ల్స్ డ్రీమ్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ హీరో ఒకరు నగ్నంగా రోడ్డుపై దర్శనమిచ్చారు.

అతను మరెవరోకాదు...కన్నడ యాక్టర్ దిగాంత్ అలియాస్. అందరూ అతన్ని ముద్దుగా పాలకోవా అని పిలుస్తుంటారు. తను నటిస్తున్న తాజా సినిమా 'పరపంచ' అనే చిత్రంలో ఓ సన్నివేశంలో నగ్నంగా నటించాడు. ఇపుడు ఈ ఫోటో ఆన్ లైన్లో హాట్ కేకులా మారింది. దిగాంత్ లేడీ ఫ్యాన్స్, ఇతర అభిమానులు ఈ ఫోటోను సోషల్ నెట్వర్కింగులో తెగ షేర్ చేసేస్తున్నారట.

See Photo: Diganth Goes Nude For Yogaraj Bhat's Parapancha

'పరపంచ' చిత్రంలో దిగాంత్ హీరోగా నటిస్తుండగా...బెంగుళూరు బ్యూటీ రాగిణి ద్వివేది హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ దర్శకుడు యోగరాజ్ భట్ తన సొంత బ్యానర్ యోగరాజ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా క్రిష్ జోషి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో క్రిష్ జోషి... యోగరాజ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసాడు. ఈచిత్రంలో యోగరాజ్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించాడట.

వీర్ సామర్థ్ అనే సంగీత దర్శకుడు 'పరపంచ' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌కు 'వెజ్ అండ్ నాన్ వెజ్' అనే ట్యాగ్ లైన్ తగిలించారు. జయంత్ కైకేని, యోగరాజ్ భట్ ఈ చిత్రానికి లిరిక్స్ రాసారు. ప్రస్తుతం ఈచిత్రం ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. దిగాంత్, రాగిణి ద్వివేదితో పాటు దత్తన్న, కెఎస్ఎల్ స్వామి, అనంత్ నాగ్, వి మనోహర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో దిగాంత్ ఎందుకు నగ్నంగా నటించాల్సి వచ్చిందనే విషయం త్వరలో దర్శక నిర్మాతలు వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X