అనుష్క-విరాట్ కోహ్లీ దొరికి పోయారు (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారు మీడియాను సైతం లెక్క చేయడం లేదు. మీడియా చూసినా ఫర్వా లేదు అనే రీతిలో ఇద్దరూ పలు ప్రాంతాల్లో పర్యటించారు.
ఇటీవల విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ముంబైలోని ఓ ఆసుపత్రికి కలిసి వచ్చారు. మరి వారు ఎందుకు వచ్చారనే విషయం మాత్రం తెలియరాలేదు. అభిమానులు చూడటంతో ఈ విషయం బయటకు పొక్కింది.
గోవా ఫుట్ బాల్ టీం సహ యజమాని అయిన విరాట్ కోహ్లి...ఇటీవల పుణెలో జరిగిన మ్యాచ్‌కు తన గర్ల్ ఫ్రెండుతో కలిసి హాజరయ్యాడు. తాజాగా ఇద్దరూ ముంబై బాంధ్రాలోని నిడో రెస్టారెంటుకు వచ్చారు. ఈ క్రమంలో మీడియాకు దొరికిపోయారు. వీరి క్లోజ్ నెస్ చూస్తుంటే.....ఈ లవ్ బర్డ్స్ ఎంత లోతు ప్రేమలో మునిగి పోయారో స్పష్టమవుతోంది.

అనుష్క శర్మ
అనుష్క శర్మ ముంబైలోని నిడో రెస్టారెంటు వద్దకు వస్తున్న దృశ్యం.

విరాట్ కోహ్లి
అదే సమయంలో విరాట్ కోహ్లి కూడా సదరు రెస్టారెంటుకు వచ్చారు.

అనుష్క-విరాట్
అనుష్క శర్మ-విరాట్ కోషహ్లి కలిసి ఇక్కడ చాలా సేపు ఏకాంతంగా గడిపారట.

సంతోషంగా...
అనంతరం ఇద్దరూ ఒకే కార్లో ఇలా చాలా సంతోషంగా కనిపించారు.

సూపర్..
ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ నెస్ ఉందో ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

విరాట్-అనుష్క
తమను కెమెరాలు గమనిస్తున్నాయనే భయం లేకుండా ఇద్దరూ ఉండటం చూస్తే ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తకు బలం చేకూరుతోంది.


Click it and Unblock the Notifications











