పారిస్‌ వెకేషన్లో మహేష్ అండ్ ఫ్యామిలీ.. ఇంటర్ కుర్రాడిలా ఉన్నాడంటూ కామెంట్స్ (ఫోటోస్)

Recommended Video

Mahesh Babu Along With His Family In Paris For A Short Vacation || Filmibeat Telugu

సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడం మహేష్ బాబుకు అలవాటు. ఆయన తాజాగా చిత్ర 'మహర్షి' షూట్ ముగియడంతో సూపర్ స్టార్ ఫ్యామిలీతో కలిసి పారిస్‌లో ల్యాండ్ అయ్యారు. వేసవి తాపం నుంచి సేద తీరుతున్నారు.

పారిస్ వెకేషన్ ఫోటోలను మహేష్ బాబుతో పాటు ఆయన సతీమని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆదివారం ఈస్టర్ పండుగ కావడంతో ఈ సందర్భంగా అందరినీ విష్ చేస్తూ నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

కుటుంబంతో కలిసి పారిస్‌లో

కుటుంబంతో కలిసి పారిస్‌లో

కుటుంబంతో కలిసి పారిస్‌లో ఒక సాయంత్రం అద్భుతంగా గడిచింది అంటూ మహేష్ బాబు తన ఇన్‍‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆయన ఈ ఫోటో షేర్ చేయడంతో అభిమానులు లైకులు, కామెంట్లతో ముంచెత్తారు.

ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్

ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్

మహేష్ బాబు లుక్ చూసిన ఫ్యాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాక హాలిడే ఎంజాయ్ చేస్తున్న బాబులా ఉన్నాడు మన బాబు' అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. ‘మహేష్ బాబు, గౌతమ్ బ్రదర్స్‌లా ఉన్నారంటూ మరొకరు తెలిపారు. ఈ ఫోటోల్లో లిటిల్స్ ప్రిన్సెస్ సితార కనిపించడం లేదేంటి? అంటూ మరికొందరు ప్రశ్నించారు.

ఈస్టర్ విషెస్ తెలియజేసిన నమ్రత

ఈస్టర్ విషెస్ తెలియజేసిన నమ్రత

పారిస్ వెళ్లే ముందు నమ్రత అభిమానులతో ఓ ఫోటో షేర్ చేసుకున్నారు. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారం రోజుల పాటు పారిస్‌లో గడిపిన అనంతరం మహేష్ బాబు ఫ్యామిలీ తిరిగి హైదరాబాద్ రానుంది.

మహర్షి

మహర్షి

మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X