‘తుఫాన్’ వీడియో ట్రైలర్ వీక్షించండి(click hear)
హైదరాబాద్ : మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగు వెర్షన్ 'తుఫాన్' వీడియో ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. 2.37 నిమిషాల నిడివిగల ఈ వీడియో సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతోంది అనే దానిపై ప్రేక్షకుల్లో ఓ అవగాహన కల్పించింది.
ఈ చిత్రంలో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, ప్రకాష్ రాజ్, శ్రీహరి, తనికెళ్ల భరణి పాత్రలు తీరు తెన్నులను ఈ వీడియోలో ప్రస్పుటించేలా చేసారు దర్శకుడు అపూర్వ లఖియా. 'తుఫాన్' చిత్రం 1973లో అమితాబ్, జయా బచ్చన్ కాంబినేషన్లో వచ్చిన 'జంజీర్' చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో ఒకే రూపొందించారు.
ఏసిపి విజయ్ ఖన్నా చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. గ్యాంగ్ లీడర్ తేజ ప్లాన్ కారణంగా ఏసిపి విజయ్ 6 నెలలు జైలుకెళతాడు. విజయ్ జైలు నుంచి విడుదలైన తర్వాత విలన్ల ఆట ఎలా కట్టించాడు అనేది తర్వాతి కథ. రామ్ చరణ్ యాంగ్రీ యంగ్ మేన్ గా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా అతని భార్య పాత్ర పోషిస్తోంది. ప్రకాష్ రాజ్, శ్రీహరి, తనికెళ్ల భరణి నెగెటివ్ రోల్స్ లో కనిపించనున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు అపూర్వ లఖియా పాత జంజీర్ స్టోరీకి ఇప్పడు అందుబాటులో ఉన్న అన్ని రకాల టెక్నాలజీలను జోడించి అద్భుతంగా తెరకెక్కించారని స్పష్టమవుతోంది. రామ్ చరణ్ కెరీర్లోనే దిబెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈచిత్రం నిలవనుంది. అదే విధంగా రామ్ చరణ్-ప్రియాంక మధ్య రొమాంటిక్ సీన్లను సినిమాకు హైలెట్ కానున్నాయి.
'తుఫాన్' వీడియో టైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తుఫాన్ ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా, అపూర్వ లఖియా, శ్రీహరి, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. రెండు రోజుల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉండటంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు.

తుఫాన్ ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్, ప్రియాంక, శ్రీహరి, ప్రకాష్ రాజ్

తుఫాన్ లో రామ్ చరణ్, ప్రియాంక హాట్ సీన్

రామ్ చరణ్, శ్రీహరి ఫైట్ సీన్

రామ్ చరణ్, ప్రకాష్ రాజ్ స్టైలిష్ లుక్

రామ్ చరణ్, ప్రియాంక రొమాంటిక్ సీన్

విలన్లను చితక్కొడుతున్న రామ్ చరణ్

తుఫాన్ లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్

తుఫాన్ చిత్రంలో శ్రీహరి సీరియస్ లుక్

లాయర్ పాత్రలో తనికెళ్ల భరణి

రామ్ చరణ్ స్టైలిష్ అవతార్

రామ్ చరణ్, ప్రియాంక సాంగ్...

రామ్ చరణ్ డేర్ డెవిల్ స్టంట్స్

రామ్ చరణ్, ప్రియాంక రొమాంటిక్ సీన్

తుఫాన్ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్తగా కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











