Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్’ చాలెంజ్ సీరియస్‌గా... (వీడియో)
ముంబై: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన ‘బ్యాంగ్ బ్యాంగ్' మూవీ అక్టోబర్ 2న విడుదల అవుతున్న సందర్భంగా వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్' పేరుతో తన తోటి స్టార్స్‌కు చాలెంజ్ విసురుతున్నాడు. ఈ చాలెంజ్ స్వీకరించిన వారు సాహసోపేతమైన పనులు చేయాలన్నమాట.
హృతిక్ రోషన్ ఇప్పటి వరకు షారుక్ ఖాన్, ఫర్హాన్ అఖ్తర్, రణవీర్ సింగ్, దాబూ రత్నానీ తదితరులకు ‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్' చాలెంజ్ విసిరాడు. వీరంతా హృతిక్ విసిరిన చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసారు. షారుక్ ఖాన్ 8 ప్యాక్ బాడీ బిల్డప్ చేసి ఈ చాలెంజ్ పూర్తి చేస్తే.....రణవీర్ సింగ్ ముంబైలో రద్దీగా ఉండే రోడ్డుపై డాన్స్ చేసి తన డేర్ నెస్ నిరూపించుకున్నాడు.
తాజాగా పర్హాన్ అక్తర్‌కు హృతిక్ రోషన్ చాలెంజ్ విసురుతూ....‘ప్లైన్ నుండి జంప్ చేయాలి లేదా గాలితో సమానంగా పరుగెత్తాలి. కానీ అతను రెండూ చేయగలడని నా నమ్మకం. పర్హాన్ అక్తర్‌కు నేను ఇచ్చే బ్యాంగ్ బ్యాంగ్ డేర్ చాలెంజ్....నీ స్కైడైవింగ్ సూట్‌తో పరుగెత్తడం లేదా సైకిల్‌పై వెళ్లాలి. నీకు అంగీకారమేనా?' అంటూ ట్వీట్ చేసాడు. మరి పర్హాన్ అక్తర్ ఏం చేసాడో... వీడియోలో చూడండి.
బ్యాంగ్ బ్యాంగ్ సినిమా విషయానికొస్తే...ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కత్రినా, హృతిక్ మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. హాలీవుడ్లో టామ్ క్రూయిజ్-కామెరూన్ డియాజ్ నటించిన 'నైట్ అండ్ డే' చిత్రానికి ఇది రీమేక్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.