‘ఎవడు’ HD ట్రైలర్ వీక్షించండి(click hear)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శృతిహాసన్, అమి జాక్సన్ హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఎవడు'. బుధవారం (మార్చి 27) రామ్ చరణ్ 28వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రం వీడియో టీజర్ విడుదల చేసారు.
ఎవడు HD టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...''మా బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా, శృతి హాసన్, అమీ జాక్సన్లు హీరోయిన్లుగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రం తెరకెక్కిస్తున్నాం. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేస్తున్నాం. ఇప్పటికే 90శాతం టాకీ పార్టు షూటింగ్ కంప్లీట్ అయిందన్నారు.

రామ్ చరణ్ ‘ఎవడు’
ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించారు.

రామ్ చరణ్ ‘ఎవడు’
గతంలో ఎవడు చిత్రం హాలీవుడ్ మూవీ ఫేస్ కు అపీషియల్ రీమేక్ అనే పుకార్లు వెలువడ్డాయి.

రామ్ చరణ్ ‘ఎవడు’
అయితే రామ్ చరణ్ ఆవిషయాన్ని ఖండించారు. అయితే పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత పోలిక ఉంటుందని ప్రచారం ఇప్పటికీ ఉంది.

రామ్ చరణ్ ‘ఎవడు’
ఈ చిత్రంలో రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రామ్ చరణ్ ‘ఎవడు’
రామ్ చరణ్ తొలిసారిగా అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈచిత్రంలో బన్నీ 15 నిమిషాల పాటు కనిపించనున్నాడు.

రామ్ చరణ్ ‘ఎవడు’
అల్లు అర్జున్ తో పాటు కాజల్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తోంది

రామ్ చరణ్ ‘ఎవడు’
ఎవడు ఆడియో మే 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

రామ్ చరణ్ ‘ఎవడు’
రామ్ చరణ్ తొలి మ్యారేజ్ డే సందర్భంగా ఎవడు చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రామ్ చరణ్ ‘ఎవడు’
వన్ ఇండియా తెలుగు తరుపున రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం
మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సూపర్ ఆడియోని మే 9న విడుదల చేస్తాము. సినిమాని జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. రాంప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ చాలాబాగుంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా నటీనటులందరినీ చాలా బాగా చూపెట్టాడని దిల్ రాజు తెలిపారు.
ప్రత్యేకమైన పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వైవిద్యమైన కథకి వినూత్నమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు వంశీ తీర్చిదిద్దాడు. ఇది టోటల్ గా టెక్నీషియన్స్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. ఆత్యంతం థ్రిల్లింగా ఉంటూనే అన్ని కమర్షియల్ హంగులతో సిద్దమవుతున్న మా 'ఎవడు' చిత్రం మెగా అభిమానులన్ని మరియు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఉంటుందని దిల్ రాజు తెలిపారు.
ఈ చిత్రంలో ఇంకా జయసుధ, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరాం, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, కథ : వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు : అబ్బూరి రవి, కథా సహకారం : హరి, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్ : సెల్వం, ఆర్ట్ : ఆనంద్ సాయి, సహ నిర్మాతలు : శిరీష్, లక్ష్మణ్, నిర్మాత : దిల్ రాజు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











