Just In
Don't Miss!
- News
Terrace ladys: పెళ్లాం పుట్టింటికి, బాత్ రూమ్ లో టెర్రాస్ లేడీస్, మనోడికి రోజూ పండగే, లొట్టలు వేస్తే!
- Sports
రిషభ్ పంత్ ప్రమోషన్ వ్యూహం నాది కాదు.. ఆ ఘనత పూర్తిగా విరాట్ కోహ్లీదే: విక్రమ్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సిమ్రాన్.. మగాడికి చీరకట్టినట్లు ఉంటుంది, సమంత మహానటి: నిర్మాత కామెంట్
శివకార్తికేయన్, సమంత, కీర్తిసురేష్‌లు హీరోహీరోయిన్లుగా పొన్‌రాం దర్శకత్వంలో తెరకెక్కిన సీమరాజా అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు. లక్ష్మీ పెండ్యాల సమర్పణలో సాయికృష్ణా ఫిలిమ్స్ బ్యానేర్ ఫై సాయికృష్ణ పెండ్యాల ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సాయికృష్ణ పెండ్యాల మాట్లాడుతూ.. ఇది పూర్తి కమర్షియల్ సినిమా, శివకార్తికేయన్ తన గత చిత్రం 'రెమో'లో ఆడవేశంలో అద్భుతంగా నటించారు. 'సీమరాజా'లో ఆయన హీరోయిజం, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు, అభిమానులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

సమంత గురించి మాట్లాడటం మన వల్ల కాదు
ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సమంత గురించి మాట్లాడాలంటే మన వల్ల కాదు.. మహానటి ఆమె. అతిథి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఆమె పాత్ర సినిమాలో కనిపించేది 30 నిమిషాలే అయినా అల్లాడించారని తెలిపారు.

మగాడికి చీరకడితే ఎలా ఉంటుందో సిమ్రాన్ అలా ఉంటింది
ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విలన్ రోల్ చేసిన సిమ్రాన్ గురించి. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా అలరించిన ఆమె ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ చేశారు. ఒక మగాడికి చీరకడితే ఎలా ఉంటుందో అలా చూపించారు. సినిమాలో ఆమె చెప్పే ఓ డైలాగ్ కూడా ఉంటుంది. ‘ఒరేయ్ మీరంతా మగాళ్లు.. లుంగీ పైకెత్తి ఫైటింగుకు వస్తారేమో... నేను చీరకట్టిన మగాన్ని' అని చెబుతుంది. సినిమాలో ఆమె పాత్ర హైలెట్ అయ్యే విధంగా ఉంటుంది. డబ్బింగ్ సినిమాలకు అవార్డులు ఇస్తే అన్నీ ఆమెకే వస్తాయని తెలిపారు.
సమంత ఫిదా అయిపోయిందిగా.. నా ఫేవరేట్ హీరో అంటూ..!

తమిళ ఫ్లేవర్ లేకుండా ట్రిమ్ చేశాం
‘సీమరాజ' తమిళ అనువాదం అయినప్పటికీ... ఒక తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండకూడదని దాదాపు 45 నిమిషాలు సినిమాను ట్రిమ్ చేశాం. ఆరు పాటలను చంద్రబోస్, వెన్నెలకంటి రాశారు. డబ్బింగ్ కూడా చాలా చక్కగా కుదిరిందని నిర్మాత తెలిపారు.

మీడియా సపోర్ట్ కావాలి
తెలుగులో ఫిబ్రవరి 8 న విడుదల చేస్తున్నాం. మీడియా సహకారం ఉంటేనే దీన్ని ప్రజల్లోకి తీసుకెల్లగలం. నైజంలో 130 థియేటర్స్, రెండు రాష్ట్రాల్లో కలిపి 400 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు సాయికృష్ణ తెలిపారు.