ఒక్క సినిమాకే బికిని దాక వెళ్ళిపోయింది సెక్సీ హీరోయిన్..!?
సీమటపాకాయ్ ముద్దుగుమ్మ పూర్ణ... పరిపూర్ణమైన ఆనందంలో ఉన్నారు. తెలుగులో తొలి విజయం ఇచ్చిన కిక్ లైఫ్ లో మరిచిపోలేనని సీమటపాకాయ్ పేలుతుందని ముందే ఊహించాను కానీ... ఈ రేంజ్‌లో పేలుతుందని మాత్రం అనుకోలేదని తెగ సంబరపడిపోతూ చెబుతున్నారామె. ఇంకా ఆమె మాట్లాడుతూ-ఇక్కడ చాలామంది నన్ను అసిన్ తో పోలుస్తున్నారు. అసిన్ గొప్ప అందగత్తె మాత్రమే కాదు మంచి నటి కూడా. ఆమెతో నన్ను పోల్చడం చాలా ఆనందాన్నిస్తోంది.
ఆర్టిస్టులను గౌరవించడంలో తెలుగు పరిశ్రమ తర్వాతే ఏదైనా. తెలుగు హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. తెలుగులో మాట్లాడుతున్నాను కూడా. ఇంకా రెండు మూడు సినిమాల్లో చేస్తే నా డబ్బింగ్ నేనే చెప్పేసుకుంటాను. సీమ టపాకాయ్ తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తా అని చెప్పారు పూర్ణ. గ్లామర్ గురించి ప్రస్తావిస్తే గ్లామర్ విషయంలో నాకు ఎలాంటి నిబంధనలూ లేవు. పాత్రోచితంగా గ్లామర్‌ని పలికించడానికి నేను రెడీ. సినిమా అంటేనే గ్లామర్ పరిశ్రమ. కథ డిమాండ్ చేస్తే బికినీలో కనిపించడానికి కూడా నేను రెడీ అని చెప్పారు పూర్ణ.


Click it and Unblock the Notifications











