సీమాంధ్ర ఫిల్మ్ చాంబర్ ఏర్పాటు

By Bojja Kumar

విజయవాడ: రాష్ట విభజన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఇప్పటికే తన కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తోంది. తాజాగా సీమాంధ్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఏర్పాటయింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన దర్శకులు, నిర్మాతల సహకారంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు దిలీప్ రాజా తెలిపారు.

 Seemandhra Film Chamber of commerce set up

ప్రస్తుతం సీమాంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసారు. విజయవాడలో సినీ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, కొత్త నిర్మాణం కాబోయే రాజధానిలో సీమాంధ్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

అయితే....ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు, దర్శకులు మాత్రం తమకు ఇంకా ఈ సీమాంధ్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ గురించి తెలియదని అంటున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలను కలుపుతు ఒకటే ‘తెలుగు ఫిల్మ్ చాంబర్' పేరుతో ఒకే చాంబర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న పరిశ్రమ పెద్దలకు కొత్తగా ఏర్పాటయిన సీమాంధ్ర ఫిల్మ్ చాంబర్ షాకిచ్చినట్లయింది. మరి దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X