ఆయన దయ ఉంటేనే ‘బాద్‌షా’ హిట్టయ్యేది!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల రూపొందించిన 'బాద్ షా' చిత్రం ఈ నెల 5న గ్రాండ్ గా విడుదలువుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయానికి తన శక్తిమేర ప్రయత్నం చేసిన శ్రీను వైట్ల.....దైవ కటాక్షం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సినిమా విజయం సాధించాలంటే మన కష్టం తో పాటు దేవుడి దయ కూడా ఉండాలని నమ్మేవారిలో శ్రీనువైట్ల ఒకరు.
మంగళవారం ఆయన సింహాచలం వెళ్లి 'బాద్ షా' మూవీ విజయంవంతం కావాలని లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు ఆయన తిరుమల వెళ్లి వెంకన్న పాదాల వద్ద సినిమా ప్రింట్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. మరి శ్రీను వైట్ల మొక్కులు ఫలించాలని, బాద్ షా చిత్రం భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.

'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.
'బాద్ షా' చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ సినిమా గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ ఈ సమ్మర్లో 'బాద్ షా' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 5.09 గంటలకు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











