రవితేజ్‌ను నేను టీజ్ చేశాను.. నా క్యారెక్టర్ అలాంటిది కాదు .. సీరత్ కపూర్ (ఇంటర్వ్యూ)

By Rajababu

రన్ రాజా రన్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ముద్దుగుమ్మ సీరత్ కపూర్ తాజాగా రవితేజ‌తో టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి కంటే ముందు టైగర్, కొలంబస్, రాజుగారి గది2, ఒక్క క్షణం చిత్రాల్లో నటించి మెప్పించింది. టచ్ చేసి చూడు చిత్రం ఫిబ్రవరి 2 తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సీరత్ కపూర్ ఫిల్మీబీట్‌ తెలుగుతో ముచ్చటించింది. సీరత్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

 రవితేజ్ మరింత పవర్‌ఫుల్

రవితేజ్ మరింత పవర్‌ఫుల్

టచ్ చేసి చూడు అనే పదంలోనే ఓ పవర్‌ ఉంది. ఇక ఈ సినిమాలో హీరో రవితేజ ఉన్నారంటే మరింత పవర్‌ఫుల్‌గా మారింది. ఈ సినిమాలో రవితేజ సర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నా పాత్రకు డామినేట్ నేచర్ ఉంటుంది.

Recommended Video

రవితేజ 'టచ్ చేసి చూడు' టీజర్ అదిరింది..!
అందుకు బాధపడటం లేదు

అందుకు బాధపడటం లేదు

నా తొలిచిత్రం రన్ రాజా రన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరచకపోయినా నాకు గొప్పగా పేరు తేలేదు. అందుకు నేను బాధపడటం లేదు. నాగార్జున సర్‌తో రాజుగారి గది2, రవితేజ లాంటి స్టార్ హీరోతో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాను. మంచి చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నాను.

అలాంటి వాటిని పట్టించుకోను

అలాంటి వాటిని పట్టించుకోను

సెకండ్ హీరోయిన్ పాత్రల్లో నటించడమనే విషయాన్ని అంతగా పట్టించుకొను. పెద్ద హీరోల పక్కన అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా అనుభవం ఉన్న రవితేజతో నటించడం నాకు చాలా ఉపయోగపడింది. ఈ చిత్రంలో రవితేజ‌లో ఓ మాస్ పాటలో కూడా కనిపిస్తాను. ఓ మాస్ సాంగ్ చేయడం నాకు ఇదే తొలిసారి.

 రవితేజను టీజ్ చేసే క్యారెక్టర్

రవితేజను టీజ్ చేసే క్యారెక్టర్

సాధారణంగా సినిమాల్లో రవితేజ్ టీజ్ చేస్తుంటాడు. కానీ ఈ సినిమాలో నేను రవితేజను టీజ్ చేశాను. మాములుగా రవితేజ్ బాగా మాట్లాడేస్తుంటాడు. ఈ చిత్రంలో రవితేజను డామినేట్ చేసే పాత్రలో నటించాను. సినిమా రెండో భాగంలో నేను కనిపిస్తాను. నిజ జీవితంలో నేను అలాంటి దానిని కాను. ఈ చిత్ర షూటింగ్ సరదాగా గడిచిపోయింది.

 రానాతో కలిసి నటిస్తున్నా

రానాతో కలిసి నటిస్తున్నా

ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్ రూపొందించే చిత్రంలో రానా దగ్గుబాటి, సిద్ధుతో కలిసి నటిస్తున్నాను. యాక్టింగ్‌కు స్కోప్ ఉండే పాత్రల్లో నటించాలని కోరుకొంటున్నాను. అనుష్క, రకుల్, సమంత యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. టాలీవుడ్‌లో వారిని ఆదర్శంగా తీసుకొంటాను.

 మంచి అవకాశాలు వస్తే

మంచి అవకాశాలు వస్తే

హిందీలో జిద్ సినిమా తర్వాత నేను మళ్లీ నటించలేదు. కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమపైనే దృష్టిపెట్టాను. మంచి అవకాశాలు వస్తే హిందీలో నటిస్తాను.

 క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఇస్తా

క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఇస్తా

సినిమాలో క్యారెక్టర్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తాను. కథలో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది అనే విషయాలను చూసుకొంటాను. గ్లామర్‌కు ఎంత స్కోప్ ఉంది. స్టోరీ ఇన్‌స్పైరింగ్‌గా ఉందా లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొంటాను అని సీరత్ కపూర్ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X