ఇలాంటి కథ ముందెన్నడూ వినలేదు.. సీరత్ కపూర్
Recommended Video

వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ఒక్క క్షణం. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో వీఐ ఆనంద్ సక్సెస్‌ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టిజర్ ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, చోట కే ప్రసాద్, రచయిత అబ్బూరి రవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరొయిన్ సురభి మాట్లాడుతూ.. ఒక్క క్షణం నటించే అవకాశం లభించడం సంతోషంగా ఉంది. షూటింగ్‌లో శిరీష్ చాలా సహకరించాడు. సినిమాపై మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు ఆనంద్. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు.

మరో కధానాయక సిరత్ కపూర్ మాట్లాడుతూ,.. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ఇంతకు ముందెన్నడు ఇలాంటి కథ వినలేదు. కథ చాలా బాగుంది. దర్శకుడు ఆనంద్‌తో పని చెయ్యడం ఇది రెండోసారి. ఈ సినిమా విషయంలో చాలా సంతో సంతోషంగా వున్నాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











