“శీతాకాలం సూర్యుడులాగ…”: బ్యూటిఫుల్ గా బన్నీ (వీడియో)
హైదరాబాద్: "శీతాకాలం సూర్యుడులాగ కొంచెం కొంచెం చూస్తావే...సూటిగ తాకే చూపుల తోటి గుచ్చేయచ్చుగా" అంటూ అల్లు అర్జున్ బ్యూటిఫుల్ ..రొమాంటిక్ మూడ్ ని తీసుకువస్తూ సన్నాఫ్ సత్యమూర్తి కోసం చేసిన ఈ సాంగ్ వీడియోని ఇక్కడ చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
'S/o సత్యమూర్తి' చిత్రం ఈ నెత 9న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ఏలో ఆగడు రికార్డును బద్దలు కొట్టడమే లక్ష్యంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి 153 లొకేషన్లు ఖరాయ్యాయి.
s/o సత్యమూర్తి' ఏప్రిల్ 9న అత్యధిక ధియోటర్స్ లొ విడుదలవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o సత్యమూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.

ఇటీవలే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో సూపర్‌హిట్ అయ్యింది. ఈ సక్సస్ ని అభిమానులందరితో పంచుకోవటానికి ఏప్రిల్ 6న విజయవాడలో 's/o సత్యమూర్తి' యూనిట్ అందరూ హజరయ్యి గ్రాండ్ గా ఆడియో సక్సస్‌మీట్‌ని నిర్వహించారు.
నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం పి.ఆర్.వో- ఎస్.కె.ఎన్, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications











