బైక్ తోస్తూ మహేష్ బాబు (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్ గా రూపొందుతున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ నెల 16న ఈచిత్రం ఆడియో విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆడియో రిలీజ్ పోస్టర్లు విడుదల చేసారు. ఈ పోస్టర్లలో వెంకటేష్ ఎక్కిన బండి తోస్తూ... లేత కొబ్బరి తింటూ మహేష్ బాబు కనిపిస్తుండం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్డూడియో గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను విడుదల చేస్తున్నారు. ఆడియో వేడుక రొటీన్ గా కాకుండా వెరైటీగా ప్లాన్ చేసారు. బుర్రకథ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో దర్శనం ఇవ్వనున్నాయి.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేస్తోంది.

ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారని రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.

బైక్ తోస్తూ మహేష్ బాబు (ఫోటో ఫీచర్)

వెంకీ ఎక్కిన బండి తోస్తూ మహేష్ బాబు

బైక్ తోస్తూ మహేష్ బాబు (ఫోటో ఫీచర్)

అన్నదమ్ములుగా వెంకీ-మహేష్ అదుర్స్..

బైక్ తోస్తూ మహేష్ బాబు (ఫోటో ఫీచర్)

కొబ్బరి తింటూ వెంకటేష్-మహేష్ బాబు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X