For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'సీతమ్మ వాకిట్లో....' కి ఈ రోజే ఆ ముచ్చట

  By Srikanya
  |

  హైదరాబాద్: ఈ సంక్రాంతి సీజన్‌లో వస్తున్న రెండు భారీ చిత్రాల్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒకటి. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందని, సెన్సార్ అందుకే లేట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే అనుకున్న రిలీజ్ టైమ్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ఈ రోజే అంటే జనవరి ఎనిమిదిన ఈ చిత్రం సెన్సార్ జరగనుంది.

  'నాయక్' మొదటగా జనవరి 9న వస్తుండగా, వెంకటేశ్, మహేశ్ అన్నదమ్ములుగా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' జనవరి 11న విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల పట్ల సగటు సినిమా ప్రియుల్లో అమితాసక్తి వ్యక్తం కావడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అంతర్జాలంలో ఈ సినిమాల విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరగగా, రెండు సినిమాల నిర్మాతలూ తమ సినిమాలు ప్రకటించిన రోజునే విడుదలవుతున్నాయంటూ ఆ ప్రచారానికి తెరదించారు.

  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం ఎదురు చూస్తున్నవారికి లెక్కే లేదు. ఇద్దరు అగ్ర నటులు కలిసి నటించడం కృష్ణ, శోభన్‌బాబు కాంబినేషన్ తర్వాత మళ్లీ ఇప్పుడే. వెంకటేశ్, మహేశ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారనే వార్త బయటకు పొక్కినప్పట్నించే ఈ సినిమా సంచలనాత్మక చిత్రంగా మారిపోయింది. ఎలాంటి వయొలెన్సూ, వికారాలూ లేని సినిమాలు బాగా తక్కువై పోయిన నేటి కాలంలో కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఓ భారీ సినిమాగా 'సీతమ్మ వాకిట్లో..' ప్రచారం పొందింది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఈ సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

  ఇదివరకు 'కొత్త బంగారులోకం' వంటి ఓ ప్రేమకథాచిత్రాన్ని మాత్రమే రూపొందించిన శ్రీకాంత్ అడ్డాల ఇద్దరు దిగ్గజ హీరోల కాంబినేషన్‌తో ఈ సినిమాని డైరెక్ట్ చేయడం, 'ఇద్దరు స్టార్ హీరోలతో ఈ రోజుల్లో సినిమా అంటే దాదాపు అసాధ్యం' అనే అభిప్రాయాన్ని తిరగరాసి, అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు దీన్ని నిర్మించడం విశేషంగానే చెప్పుకోవాలి. కుటుంబ ఆత్మీయతలు, ఆప్యాయతలు ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన తెలుగమ్మాయి అంజలి, మహేశ్ జోడీగా సమంత నటించగా, హీరోల తల్లిదండ్రుల పాత్రల్ని జయసుధ, ప్రకాశ్‌రాజ్ పోషించారు. మిక్కీ జె. మేయర్ స్వరాలు కూర్చిన ఇందులోని పాటలు హాయిగా ఉన్నాయని అందరూ అంటున్నారు.

  సమంత, అంజలి, ప్రకాష్‌ రాజ్, జయసుధ, రోహిణిహట్టంగడి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజెమేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాత: దిల్‌ రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

  English summary
  The censor certification of Venkatesh and Mahesh Babu’s ‘Seethamma Vakitlo Sirimalle Chettu’ will take place today morning (8th Jan) . The movie is gearing up for a release on January 11th and it is one of the eagerly projects of the year. Premiere shows are expected on 10th. The film has been directed by Srikanth Addala and Dil Raju is the producer. Mickey J Meyer has composed the film’s music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X