twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫస్ట్ లుక్

    By Bojja Kumar
    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు రూపొందిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫస్ట్ లుక్ ట్రైలర్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ రోజు విడుదల చేశారు. ట్రైలర్లోనే సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని స్పష్టం అవుతోంది.


    కుటుంబ బంధాలు, ఆప్యాయతలు లాంటివి కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా రోజుల తరువాత ఇద్దరు ప్రధాన తారలు ఒక చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు ఈ చిత్రం మొదలయ్యాక పరిశ్రమలో కొన్ని మల్టీ స్టారర్ లు మొదలయ్యాయి. ఈ చిత్రం చిత్రీకరణ మొదలు పెట్టుకొని మూడు నెలలు దాటింది. ఈ చిత్రం తన కెరీర్లో మంచి చిత్రంగా మిగిలిపోతుందని మహేష్ బాబు నమ్ముతున్నారు.

    ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సమంత, అంజలిలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం ఈ దసరాకి విడుదల కానుంది. మహేష్ బాబు ఫేవెరెట్ కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు, దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.

    దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమాను ముందుకు తీసుకెలుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఇక్కడ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజే విడుదల చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. గతంలో పోకిరి, దూకుడు చిత్రాల ఫస్ట్ లుక్ కూడా కృష్ణ బర్తడే సందర్భంగా విడుదల చేశారు. ఆ సెంటిమెంటు కలిసొచ్చి సినిమా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.

    English summary
    We all know that Victory Venkatesh and Mahesh Babu are doing a multistarer movie 'Seethamma Vakitlo Sirimalle Chettu' under Dil Raju production. Statement about the movie itself created sensation among the movie lovers. Later the movie was launched and shot in various locations of India and currently under last leg of production. Now it is the time for SVSC's first look. first look of the movie will be unveiled tomorrow on today at Prasad labs, on behalf of super star Krishna's birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X