'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లేటెస్ట్ ఇన్ఫో

By Srikanya

మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల రూపొందించనున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రం ఆల్రెడీ లాంచింగ్ జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ ఐదున ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంతను ఎంపిక చేసారు. వెంకటేష్ సరసన ఇంకా ఎవరూ డిసైడ్ చెయ్యలేదు. అంతా త్రిష అనుకున్నారు కానీ ఆమె చేయనని ఖచ్చితంగా ఖండించి చెప్పేసింది. ఇక సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్ ఈ చిత్రం కోసం రెండు పాటలను ఆల్రెడీ సిద్దం చేసారు. అతను శ్రీకాంత్ గత చిత్రం కొత్త బంగారు లోకం కోసం కూడా సంగీతం అందించారు.

అప్పట్లో ఆ పాటలు మంచి క్రేజ్ ని క్రియోట్ చేసాయి. ఇక అనంత శ్రీరామ్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. మహేష్ బాబు ఫేవెరెట్ కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు, దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. అలాగే మహేష్, వెంకటేష్ అన్నదమ్ములగా కనిపించనున్నారని, ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రకు ఎంపిక చేసారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు.. అంటే కుటుంబం అని కాన్సెప్టు తో ఈ చిత్రం నిర్మితమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X