పెద్దోడు-చిన్నోడు ( ‘సీతమ్మవాకిట్లో...’ ప్రివ్యూ)
హైదరాబాద్ : బంధాలు, బాంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం అంటూ చెప్పబడుతున్న మల్టి స్టారర్ చిత్రం 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్, మహేష్ ఇందులో అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. మహేష్ చిత్రం, అదీ కుటుంబాలని టార్గెట్ చేయటంతో చిత్రానికి మంచి క్రేజే ఉంది.
తోటి వారికి సాయం చేయడంలో ఉన్న సంతృప్తి డబ్బు సంపాదించడంలో ఉండదు అనుకునే ఓ ఆదర్శవంతమైన తండ్రి (ప్రకాష్‌రాజ్). ఆయనకు ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె. పెద్దబ్బాయి (వెంకటేష్) ఎవరితోనూ మాటపడకూడదనుకొనే తత్వం ఉన్నవాడు. ఇక చిన్నబ్బాయి (మహేష్‌బాబు) మాటలతో నెగ్గుకొచ్చేగయలడు. అనుబంధాలు, ఆప్యాయతలే ఊపిరిగా బతికే ఈ కుటుంబంలో మనస్పర్థలు వస్తే వారి మధ్య ఉన్న అనురాగంతో వాటిని ఎలా అధిగమించారనేది మిగిలిన కథ. ఇందులో సీత (అంజలి), గీత (సమంత) పాత్రలూ కీలకమైనవే.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''మన ఇంట్లోనో, తెలిసినవాళ్ల కుటుంబంలోనో జరిగిన కథలా అనిపిస్తుంది. అన్నదమ్ముల అనుబంధం విలువని చాటిచెప్పే చిత్రమిది. ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ విధంగా తీర్చిదిద్దాము''అన్నారు.
''సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా అసలుసిసలైన సంక్రాంతి సినిమా. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. మహేష్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది'' అని వెంకటేష్ చెప్పారు.
మూడు రోజులకు ముందే తెలుగునాట సంక్రాంతిని తెచ్చే సినిమా ఇదని, వెంకటేష్‌గారితో కలిసి నటించడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిందని, అన్ని విధాలుగా తనకు సంతృప్తి పంచిన సినిమా ఇదని మహేష్ అన్నారు.
బ్యానర్ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు : మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు
సంగీతం : మిక్కీజె మేయర్,
ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్,
సినిమాటోగ్రఫీ : గుహన్,
ఫైట్స్: విజయ్,
నిర్మాత : దిల్ రాజు,
కధ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.
విడుదల: 11, జనవరి 2012(శుక్రవారం).


Click it and Unblock the Notifications











