For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ఎంతవరకూ వచ్చింది?

  By Srikanya
  |

  హైదరాబాద్ : వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ..''నిర్మాతగా నా కెరీర్‌లోనే మరిచిపోలేని సినిమా ఇది. వెంకటేష్, మహేష్ లాంటి టాప్ స్టార్స్‌తో మల్టీస్టారర్ మూవీ చేయడం గొప్ప అనుభూతి. భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమా. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది'' అని 'దిల్' రాజు చెప్పారు.

  అలాగే మల్టీస్టారర్ చిత్రంగా నిర్మాణమవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, కుటుంబ విలువలు ప్రధానంగా చర్చిస్తున్న ఈ చిత్రం యువతకు, మహిళలకు తప్పక నచ్చుతుందని తెలిపారు. అన్న వెంటే తమ్ముడు కూడా అడవులు పట్టిపోవడానికి ఇది రామాయణం కాదు. తమ్ముడి కోసం రాజ్యాన్ని ధారబోసే అన్నలూ లేరు. ఆస్తితో అడ్డగీత గీస్తే అనుబంధం రెండు ముక్కలైపోతున్న రోజులివి. ఇప్పుడు కూడా అన్నమాట జవదాటని తమ్ముడున్నాడా? తండ్రి ఇచ్చిన మాట కోసం తమ సర్వస్వం ధారబోసే తనయులు కనిపిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మా సినిమా చూడాలి అన్నారు దిల్‌ రాజు.

  ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది? ఉద్యోగం పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొకరిది పట్నవాసం. ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్‌, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా సినిమాలో చూడొచ్చు అని చెప్పుకొచ్చారు.

  సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణిహట్టంగడి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజెమేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

  English summary
  
 Mahesh babu and Venkatesh starrer movie 'Seetamma Vakitlo Sirimalle Chettu' is busy with the shooting in Ramoji film city. Director is canning scenes on the lead star cast of the film. Samantha and Anjali are roped in as lead actress in the film. Seethamma Vakitlo Sirimalle Chettu is touted to be an family entertainer shaping up in the hands of Srikanth Addala.Mickey J Meyer is rendering tunes of the film while Cinematography by Guhan.Dil Raju is producing SVSC under Sri Venkateswara Creations banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X