సినీమాక్స్ వద్ద మహేష్ బాబు సందడి
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటిటింగ్ ఈ రోజు హైదరాబాద్ నగరంలోని సీనిమాక్స్ వద్ద జరుగుతోంది. ఇక్కడ మహేష్ బాబు మరియు సినిమాలో అతని స్నేహితులుగా నటిస్తున్న వారిపై పలు సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ షూటింగ్ ముగిసిన అనంతరం మహేష్ బాబు 'లవ్లీ' ఆడియో ఫంక్షన్‌కు హాజరుకానున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో విక్టరీ వెంకటేష్ తో పాటు మహేష్ బాబు కథానాయకులుగా నటిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి హీరోయిన్లు. ఈ చిత్రం నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ మహేష్ బాబు రాయబారంతో తిరిగా ఆయన మళ్లీ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు.
ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ చిత్రంలో లెక్చరర్ పాత్రలో దర్శనం ఇవ్వబొతున్న మహేష్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడని చర్చించుకుంటున్నారు. ఇందులో మహేష్ బాబు మరోసారి బాలీవుడ్ ఐటం బాంబ్ మలైకా అరోరాతో స్టెప్పులేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











