సంక్రాతికి ఆ ఐదు చిత్రాలు..నిర్మాణ వ్యయం
నమో వెంకటేశ, అదుర్స్, శంభో శివ శంభో, ఓం శాంతి, సీతారాముల కళ్యాణం ఈ ఐదుచిత్రాలు సంక్రాంతి బరిలో ఉండబోతున్నాయి. యుగానికొక్కడు వంటి డబ్బంగ్ చిత్రాలు తో కాకుండా ఈ ఐదు తెలుగు చిత్రాలపై దాదాపు రూ.150 కోట్ల వ్యాపారం సాగబోతోంది.
వెంకటేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న నమో వెంకటేశ దాదాపు 25 కోట్ల వ్యయంతో రూపొందింది. శ్రీను వైట్ల రెగ్యులర్ కామిడీనే ఈ చిత్రానికి యు.ఎస్.పి.అలాగే త్రిష, వెంకటేష్ కాంబినేషన్ రిపీట్ కావటం, బ్రహ్మానందం ప్యారిస్ ప్రసాద్ గా నవ్వించటానికి రెడీ అవ్వటం ఈ చిత్రంపై నమ్మకాలు పెంచుతున్నాయి.
బెల్లంకొండ సురేష్ నిర్మించిన శంభో శివ శంభో చిత్రం తమిళ చిత్రం నాడోడిగల్ ఆధారంగా రూపొందింది. దాదాపు 17 కోట్లు ఖర్చుపెట్టారు. రవితేజ, నరేష్, శివబాలాజీ హీరోలు. ప్రియమణి, అభినయ హీరోయిన్స్. తమిళంలో ఒరిజనల్ చిత్రం రూపొందించిన సముద్ర ఖని ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటం ప్లస్.
ఎన్టీఆర్, వివివినాయిక్ కాంబినేషన్ లో రెడీ అయిన అదుర్స్ దాదాపు 33 కోట్ల వ్యయంతో రూపొందింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆంధ్రావాలా అనంతరం ద్విపాత్రాభినయం చేసారు. ఫుల్ లెంగ్త్ కామిడీగా ఈ చిత్రం తయారైంది. నయనతార, షీలా అందచందాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు.
అయిదు కథలు... అయిదు జీవితాలు... ఒక నిజం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న 'ఓం శాంతి' చిత్రం ఐదు కోట్ల వ్యయంతో రూపొందింది. బాణం చిత్రాన్ని నిర్మించిన త్రీ ఏంజిల్స్ స్టూడియో పతాకంపై శేషుప్రియాంక చలసాని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. నేరేషన్ స్టైల్ కొత్తగా ఉండటమే ఈ చిత్రానికి ప్లస్.
నితిన్, హన్సిక కాంబినేషన్ లో ఈశ్వర రెడ్డి డైరక్ట్ చేసిన చిత్రం 'సీతారాములకళ్యాణం'...లంకలో. ఈ చిత్రానికి తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు. ప్యామిలీలను టార్గెట్ చేయటమెక్కటే ఈ చిత్రానికి ఉన్న సేలబులటీ పాయింట్. వీటిల్లో 'నమో వెంకటేశ', 'అదుర్స్'... రెండింటికీ దేవిశ్రీప్రసాదే సంగీతాన్ని అందించడం విశేషం.


Click it and Unblock the Notifications











