‘ఆనంద్’ను కొనేందుకు ఎవ్వరూ రాలేదు.. ఫిదాను ముందు వారికే చెప్పా.. శేఖర్ కమ్ముల కామెంట్స్

శేఖర్ కమ్ముల ఎంతటి సున్నితమైన అంశాలను తీసుకుని తెరపై అందంగా తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. ప్రేమ, ద్వేషం, కోపం, అసూయ వంటి వాటి చుట్టూ సున్నితమైన అంశాలను స్పృశిస్తూ ఆయన తెరకెక్కించే విధానానికి టాలీవుడ్ ఆడియెన్స్ అభిమానులుగా మారారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు ధీటుగా రిలీజ్ చేసినా కూడా సక్సెస్ అవుతూ వచ్చాయి. అలా హ్యాపీ డేస్, ఆనంద్ చిత్రాలు చిరంజీవికి పోటీగా నిలబడి గెలిచాయి.

అలాంటి చిత్రాలే..

అలాంటి చిత్రాలే..

శేఖర్ కమ్ముల ఎప్పుడూ క్లాస్ చిత్రాలనే ఎంచుకున్నాడు. అయితే అది మాస్ ఆడియెన్స్‌కి కూడా నచ్చుతుంటాయి. హ్యాపీడేస్, లీడర్, ఆనంద్, గోదావరి వంటి సినిమాలు ఆయన మార్క్‌ను అందరికీ గుర్తుండిపోయేలా చేశాయ్. ఫిదా సినిమాతో మరోసారి శేఖర్ కమ్ముల తన సత్తా చాటాడు.

తాజాగా అలా..

తాజాగా అలా..

ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా శేఖర్ కమ్ముల అలీతో సరదాగా షోకి గెస్ట్‌గా వచ్చాడు. ఇందులో శేఖర్ కమ్ముల అనేక విషయాలను బయటకు చెప్పేశాడు. ఆనంద్ సినిమా విషయంలో ఎదురైన కష్టాలను కూడా చెప్పుకొచ్చాడు.

శంకర్ దాదాకు పోటీగా..

శంకర్ దాదాకు పోటీగా..

చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు పోటీగా ఆనంద్ వచ్చింది. ఆ సమయంలో ఆనంద్ సినిమాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అక్కడ చిరంజీవి సినిమా వస్తుంటే ఇదేం సినిమా అనే వాళ్లు అంటూ నాటి విషయాలను శేఖర్ కమ్ముల గుర్తుకు చేసుకున్నాడు.

పెద్ద స్టార్స్‌తో..

పెద్ద స్టార్స్‌తో..

శేఖర్ కమ్ముల పెద్ద స్టార్స్‌తో ఎందుకు చేయరు? కావాలని చేయరా? లేదా రిస్క్ ఎందుకు అని దూరంగా ఉంటున్నారా? అని అలీ వేసిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. అలాంటిదేమీ లేదని చెబుతూ అసలు విషయం బయటపెట్టేశాడు శేఖర్ కమ్ముల.

Recommended Video

Saranga Dariya 100 Million Views Record, ఆ ఇద్దరూ ప్రధాన కారణం!!
ముందు వారికే..

ముందు వారికే..

నేను నెరేషన్ ఇస్తే నిద్రపోవాల్సిందే.. చాలా స్లోగా చెబుతుంటాను.. నేను చాలా మంది స్టార్ హీరోలకు కథలు చెప్పాను. వారికి నచ్చితే ఓకే అనేవాళ్లు లేదంటే వద్దని చెప్పేవాళ్లు. ఫిదా కథను ముందు మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు చెప్పాను అంటూ అసలు విషయం బయట పెట్టేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X