రజనీకాంత్‌తో ‘లీడర్’ రీమేక్ అంటూ...శేఖర్ కమ్ముల
ఇటీవల రజనీకాంత్‌కు సంబంధించిన బుక్ విడుదల కార్యక్రమంలో శేఖర్ కమ్ముల ఈ విషయాన్ని బయట పెట్టారు. రజనీకాంత్ పెద్ద స్టార్ మాత్రమే కాదు...ఆయనొక ఐకాన్. ప్రభుత్వాలను మార్చే శక్తి ఆయనకు ఉంది. ఆయనతో లీడర్ సినిమా చేస్తే సమాజంలో తప్పకుండా మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. ఆయనతో లీడర్ సినిమా రీమేక్ చేయడానికి ప్రయత్నించాను. కానీ కుదరలేదు అని చెప్పుకొచ్చారు.
శంకర్, కెఎస్ రవికుమార్ లాంటి బడా దర్శకులతో భారీ బడ్జెట్ సినిమాలు తప్ప చిన్న దర్శకులతో ఈ మధ్య సినిమాలు చేయడం మానేసిన రజనీకాంత్ శేఖర్ కమ్ములకు అవకాశం ఇస్తారా? అంటే చెప్పడం కష్టమే. ఏమో శేఖర్ కమ్ముల సుడి తిరిగితే ఆయనతో 'లీడర్' సినిమా రీమేక్ చేయడానికి రజనీ ఒప్పుకోవచ్చేమో?
ఇక శేఖర్ కమ్ముల ప్రస్తుతం హిందీ హిట్ మూవీ 'కహానీ' చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేయడానికి స్క్రిప్టు వెర్షన్ ని తిరగరాస్తున్నారు. ప్రిబ్రవరి నెలలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












