For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె రాలేనని చెప్పింది.. క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తాం.. సారంగదరియాపై శేఖర్ కమ్ముల

    |

    తెలుగు చిత్ర సీమలో ఈ మధ్య సారంగ దరియా పాటపై వచ్చిన వివాదాలు మరే ఘటనపైనా రాలేదు. ఒకరు ఆ పాట నాది అంటారు.. ఇంకోరు ముందు నేను పాడాను కాబట్టి అది నాది అంటారు. జానపదం కాబట్టి అందరి అందరి సొత్తు అని ఇంకొకరు అంటారు. మొత్తానికి లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియాపై, దాని మీద నెలకొన్న వివాదానికి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అసలు జరిగిన కథనంతా కూడా వివరిస్తూ సుధీర్ఘ పోస్ట్ చేశాడు.

     అలా గుర్తిండిపోయింది..

    అలా గుర్తిండిపోయింది..

    చాలా ఏళ్ళ కిందట 'రేలా రే రేలా' ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి 'సారంగ దరియా' అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా మైండ్‌లో తిరుగుతూనే ఉందని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.

     డబ్బులు చెల్లించాను..

    డబ్బులు చెల్లించాను..

    నా మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్‌లో లక్కి అలి పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్‌లో వాడినందుకు సోనీ కంపెనీకి నేను డబ్బులు చెల్లించాను. ఫిల్మ్‌లో క్రెడిట్స్ కూడా ఇచ్చా. తర్వాత తీసిన 'ఆనంద్' లో లక్కి అలితో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్‌లో సుబ్బలక్స్మి గారి పాట నుండి ఫిదాలో మల్లీశ్వరి సినిమాలోని అప్పగింతల పాట వరకు స్టొరీ రాస్తున్నప్పుడు నాకు ఒకో సినిమాకి ఒకో పాట తిరుగుతుంటుంది. లవ్ స్టోరీ ఫిల్మ్‌కి నా మనసులో ఈ పాట ఉందని శేఖర్ కమ్ముల అన్నాడు.

    డెలివరీ టైం అని..

    డెలివరీ టైం అని..

    సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని సినిమాకి అనుకూలంగా రాయాలి అంటే, ఈ పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాట కి అంత బాగా లిరిక్స్ రాసినందుకు చాలా హ్యాపీ అయిపొయా. మా టీం లో ఏడీ(అసిస్టెంట్ డైరెక్టర్) ఒకరు శిరీష ఫోన్ నంబెర్ సంపాదించి, ఆమెని కాంటాక్ట్ చేశారు. ఆమెకి అప్పటికి డెలివరీ టైం అంటే, మేము ఇంక సరే అనుకున్నాం. కరొన వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యింది. బాలింత అవ్వడం, చిన్న పిల్లాడు ఉండటంతో శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదని శేఖర్ కమ్ముల పేర్కొన్నాడు.

    ఫిబ్రవరి చివర్లో..

    ఫిబ్రవరి చివర్లో..

    ఈ పాట ని నవంబర్లో షూట్ చేశాం. అది కూడా ట్రాక్ సింగర్ పాడిన వర్షన్‌తోనే. ఫిబ్రవరి ఆఖరులో మంగ్లి తో పాడించాం. ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. 'ఇద్దరు సింగర్స్ ఆ పాట మేమే పాడాలి అంటున్నరు అని'. ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీం లో ఏడీ ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళానని శేఖర్ కమ్ముల అన్నాడు.

     రాలేను అంది..

    రాలేను అంది..

    ఈలోగా ఆయన వివరాలు సేకరించి, 'ఆ ఇద్దరిలో కొమలే ఆ పాటని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం' అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. 'పాట రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేసాం కాబట్టి, కోమలని వెంటనే రమ్మని' అడిగాం. వరంగల్ నుండి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. మ్యూజిక్ డైరెక్టర్‌ని చెన్నయ్ నుండి రప్పించాం. 'జలుబు ఉంది, రాలేను' అంది కోమల. పాట అనౌన్స్ చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి క్రెడిట్ ఇస్తే అభ్యంతరం లేదు అంది. 'జెన్యూన్ కేస్ సర్. క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది' అని సుద్దాల గారు అన్నారు. కోమల ని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పానని అసలు విషయం తెలిపాడు శేఖర్ కమ్ముల.

    క్రెడిట్ ఇస్తాం.. డబ్బులు ఇస్తాం..

    క్రెడిట్ ఇస్తాం.. డబ్బులు ఇస్తాం..

    ఆడియో ఫంక్షన్‌లో పాడమని, అందరూ చూస్తారని గుర్తింపు బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది. సుద్దాల గారి ఇంటి నుండి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు - ఫేస్‌బుక్‌లో కోమలకి థ్యాంక్స్ చెప్పాను. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలకి మేం ప్రామీస్ చేసినట్టు ఫిల్మ్‌లో క్రెడిట్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఆడియో ఫంక్షన్ ఫిక్స్ అయితే , కోమలకి పాడమని ఆహ్వానం పంపిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడి నేను టివి ల్లో జరుగుతున్న చర్చలు ఫాలో కాలేదు. ఒకేసారి ఫేస్ బుక్‌లో అందరికి సమాచారం ఇస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు అంటూ వివాదానికి శేఖర్ కమ్ముల పుల్ స్టాప్ పెట్టేశాడు.

    English summary
    Sekhar kammula about Saranga dariya Controversy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X