శేఖర్ కమ్ముల "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" చిత్రం ఆ హీరోతోనే
శేఖర్ కమ్ముల తాజా చిత్రం "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" కి హీరోగా వరుణ్ సందేశ్ నే ఎన్నుకున్నారు. హ్యాపీడేస్ తో తాను పరిచయం చేసిన వరుణ్ ని ఎన్నుకుని ఆయన ప్రస్తుతం ప్లాపుల పరంపరలో ఉన్నాడు. అలాగే శేఖర్ కూడా లీడర్ చిత్రం విజయవంతం కాకపోవటం నిరాశపరిచిన అంశం.దాంతో సేఫ్ జోన్ లోకి వెళ్ళి తిరిగి తమ కాంబినేషన్ ని రిపీట్ చేయటం మేలని భావించే ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు. ఇఖ ఈ చిత్రానికి అంతా కొత్తవాళ్ళనే పరిచయం చేస్తాననే ఆలోచన అటకెక్కినట్లేనా లేక మిగతా పాత్రలకు కొత్త వారిని తీసుకుంటాడా అనేది తేలాల్సిన విషయం. ఇక వరుణ్ సందేశ్ తాజా చిత్రం ఏమైంది ఈవేళ కాంట్రావర్శితో అయినా క్లిక్ అయింది. అలాగే అతని తదుపరి చిత్రం కుదిరితే కప్పు కాఫీ విడుదలకు రెడీగా ఉంది.
వరుణ్ సందేశ్ శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హ్యాపీడేస్ ఆనంద్ లీడర్ varun sandesh sekhar kammula life is beautiful happy days anand leader


Click it and Unblock the Notifications