twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంట్రా ఇలా చేస్తున్నాడని అనుకున్నాను.. రానాపై శేఖర్ కమ్ముల కామెంట్స్

    |

    రానా దగ్గుబాటి ప్రస్తుతం అరణ్య సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్యాన్ ఇండియన్ చిత్రంగా రాబోతోన్న అరణ్య మూవీ మార్చి 26న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు శేఖర్ కమ్ముల, వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. లీడర్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. అరణ్య సినిమాకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాడు.

    లీడర్ సినిమాతో..

    లీడర్ సినిమాతో..

    లీడర్ సినిమాతో రానా వెండితెరకు పరిచయమయ్యాడన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే రానా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మొదటి సినిమాగా లీడర్‌ను ఎంచుకుని, అద్భుతంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    రానా నటించిన అరణ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. డైరెక్టర్ సోలోమన్ రానా మొహం చూసి ఈ పాత్రకు సెలెక్ట చేసుకుంటే.. నేను రానా గొంతు, ఆ పొడుగు చూసి సెలెక్ట్ చేసుకున్నాను. నా అర్జున్ ప్రసాద్ ఇలా ఉండాలని ఫిక్స్ అయ్యాను అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.

    అప్పుడే అలా..

    అప్పుడే అలా..

    ఆ సమయంలో నేను కేవలం నా సినిమాలు తెలుగులో గొప్పగా ఉండాలని అనుకున్నాను. కానీ రానా ఆలోచనలు మాత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండేవి. ఆ రేంజ్ సినిమాలు చేయాలని అనుకునే వాడు. అందుకే ఇలాంటి విభిన్న చిత్రాలు చేస్తూ వచ్చాడని శేఖర్ కమ్ముల అన్నాడు.

    మాకంటే ముందుగా..

    మాకంటే ముందుగా..

    ఓ హీరో జర్నీ అంటే ఇలా ఉంటుందా? అని ఆలోచించేలా రానా చేశాడు. రానాలో నాకు నచ్చిన విషయం క్రమశిక్షణ. రామా నాయుడు మనవడు కదా? ఎలా ఉంటాడా? అని అనుకున్నాను. కానీ షూటింగ్ ఆరు గంటలకు అని చెబితే మాకంటే ముందుగా వచ్చి అర్జున్ ప్రసాద్ హియర్ సర్ అని చెప్పేవాడు. ఇప్పటికీ అదే క్రమశిక్షణ, అదే నిబద్దత, ఒదిగి ఉండే తనం రానాలో ఉన్నాయని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.

    ఏంట్రా ఇలా చేస్తున్నాడు..

    ఏంట్రా ఇలా చేస్తున్నాడు..

    ఓ నటుడిగా కంటే రానా వ్యక్తిగా ఎంతో ఎత్తులో ఉంటాడు. రత్నం లాంటి మనిషి.. నటన పరంగా ఎంతో ఎదిగిపోయాడు. అరణ్య చూస్తుంటే ఏంట్రా ఇలా చేస్తున్నాడు అని అనుకున్నాను. ఆయన ఇలాంటి ప్రత్యేకమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అడవి, ఏనుగులు ఇలాంటి మధ్య సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఇది అంతర్జాతీయ స్థాయి ఉన్న సినిమా. ఈ సినిమాను చూసి అందరూ ఆశీర్వదించండి అని శేఖర్ కమ్ముల కోరాడు.

    English summary
    Sekhar kammula at rana aranya Pre release event,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X