twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అమల, శ్రీయ, అంజలాజవేరి ఎందుకంటే..

    By Srikanya
    |

    హైదరాబాద్ :అమల, శ్రీయ, అంజలాజవేరి ఈ ముగ్గురూ ఇప్పుడు శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్టుకు క్రేజ్ తేవటం కోసం వీరిని పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపద్యంలో శేఖర్ కమ్ముల వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..." వీళ్లను క్రేజ్ కోసం పెట్టలేదు. ఆ పాత్రలకు వాళ్లే సూటబుల్. ఆ ముగ్గురివి గెస్ట్ పాత్రలు కాదు. అందరూ కొత్తవారితో చేసిన సినిమా. ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదు. ఎంత వ్యయంతో తీశానో అంత బిజినెస్ కూడా జరిగింది. అమల ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం నిజంగా అదృష్టం. ఆమె పోషించిన పాత్ర చాలా ఉదాత్తంగా ఉంటుంది. అంజలా జవేరిని గతంలో ఎలా చూశానో ఇప్పటికీ అలాగే ఉన్నారు. శ్రియ పాత్రను కావాలనే ఎన్నుకున్నాం. ఆ ముగ్గురిని పబ్లిసిటీకి ఉపయోగించుకోవచ్చని ఎప్పుడూ అనుకోలేదు. నాతో సహా ఈ ప్రాజెక్ట్‌కి పనిచేసిన వారందరూ స్క్రిప్ట్ డిమాండ్ మేరకే చేశారు. అందరి దృష్టిని ఆకర్షించడం చాలా ఆనందంగా ఉంది''అన్నారు.

    అలాగే ఈ సినిమా చేయాలా వద్దా అని అమల మూడు నెలలు తటపటాయించారు. ఆవిడ చేయడం మా అదృష్టం. ఆ మధ్య ఒక వాణిజ్య ప్రకటనలో అంజలాజవేరీని చూసినప్పుడు ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం 'ప్రేమించుకుందాం రా'లో కావేరి గుర్తుకొచ్చింది. ఇప్పటికీ అంతే ఫ్రెష్‌గా ఉంది తను. నేను అడిగిన వెంటనే ఒప్పుకుంది. ఇక శ్రీయ పాత్రకు అలాంటి స్టార్ స్టేచర్ ఉన్న ఆర్టిస్టే కావాలి అని చెప్పుకొచ్చారు.

    ఇక ఈ సినిమాకు 144 రోజులు పట్టడంపై విశ్లేషిస్తూ... వర్కింగ్ డేస్ నేను తీసే ఏ సినిమాక్కూడా చిన్నా పెద్దా అనే కొలమానాలు పెట్టుకోను. నేను రాసుకున్నది తెరపై బాగా చూపగలుగుతున్నానా లేదా అన్నదే ఆలోచిస్తాను. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'ని 144 రోజులు తీశాను. ఇంకొకరైతే ఈ టైమ్‌లో 3 సినిమాలు తీసేసేవారేమో. ఎందుకింత స్లోగా తీస్తున్నానో నన్ను నేను ఎనలైజ్ చేసుకోవాలి. సినిమా ఎక్కువరోజులు పట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. కొత్తవారు కావడం, కొన్నిసార్లు సమ్మెలు జరగడం, వాతావరణ అనుకూలించకపోవడం వంటివి. ఇది ఎక్కువే. అందుకే భవిష్యత్‌లో నా బాణీని మార్చుకుంటాను అన్నారు.

    ఇక 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం తర్వాత ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే...తర్వాత ఏం చేస్తానో, ఏం చేయాలో కూడా ఇంకా ఆలోచించలేదు. 'హ్యాపీడేస్'ని హిందీలో చేసే ఆలోచనలో ఉన్నప్పుడు 'లీడర్' ఆలోచన వచ్చింది. తర్వాత ఈ కథ పుట్టింది. తమిళ, హిందీల్లో కూడా మన మార్కెట్ పెంచుకోవచ్చు. అయితే నా కథలు పూర్తిగా తెలుగు మూలాలతో తయారవుతాయి. అందుచేత వాళ్లకు కనెక్ట్ కాకపోవచ్చు అన్నారు. ఇక స్టార్స్‌తో సినిమా చేయకూడదని నేనెప్పుడూ అనుకోలేదు. నా కథ కొత్తవారిని డిమాండ్ చేస్తే కొత్తవారితో పనిచేస్తా. స్టార్స్ కావాలంటే వారిదగ్గరకు వెళ్తాను. అలాగే నా కథలు చాలా వరకు తెలుగుదనంతో నిండి ఉంటాయి. హ్యాపీడేస్‌ను తమిళ్‌లో తీశారు. అక్కడ పెద్దగా ఆడలేదు. కారణం నా సినిమాలు మన వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటాయి. తెలుగుతనం అనే సూత్రంతో అల్లుకుని ఉంటాయి. నేనెప్పుడు సినిమా చేసినా మధ్యతరగతి కుర్రాళ్ళనే ధ్యేయంగా పెట్టుకుంటాను. నా టార్గెట్ ఆడియన్స్ వారే. అలాగే సింపుల్‌గానే సినిమాలు చేస్తా. సింపుల్ సినిమాలుచేయడం చాలా కష్టం అన్నారు.

    English summary
    "For one of the central characters, we thought Amala would be the best choice but we had our doubts about her doing the role after so long. We eventually approached her and narrated the story to her, and she took three months to confirm her participation in the film. ...I felt Anjala Jhaveri was still beautiful when I saw her as a brand ambassador for Nirma, and thus contacted her for the role. We needed a star with a certain aura for Shirya's role, based on the character in the film" Shekar Kammula said. Shekar Kammula’s upcoming movie Life Is Beautiful is all set to release on September 14. Everything is ready for this film and the prints will be dispatched in time to all the areas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X