శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్..!
రామానాయుడు మనమడు 'రాణా" ని తెలుగుతెరకు పరిచయం చేసిన శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని అతని బాబాయ్ వెంకటేష్ తో చేయనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..అయితే కమ్ముల తర్వాత చిత్రం వెంకీతో కాదు..మగధీర రామ్ చరణ్ తో అని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ కోసం ఓ కథను కూడా తయారు చేసుకుని రెడీగా ఉన్న శేఖర్ కమ్ముల తన కథని రామ్ చరణ్ కి వినిపించడానికి షూటింగ్ నిమిత్తం ముంబాయిలో ఉండగా వెళ్లి కలిసి తను తయారు చేసిన కథను వినిపించాడని సమాచారం..అయితే రామ్ చరణ్ ప్రస్తుత చిత్రం 'ఆరంజ్" తో పాటు ధరణి రూపొందిస్తున్న చిత్రం 'మెరుపు" కూడా లైన్ లో ఉండటంతో కమ్ముల చిత్రం పై అంతగా శ్రధ్ద పెట్టలేదని కథ మొత్తం విని..ఇంకా టైం ఉంది కదా! ఆలోచించుకుని చెబుతానని అన్నాడట రామ్ చరణ్. శేఖర్ కమ్ముల కథ తయారు చేశాడంటే అందులో విషయం బాగానే ఉంటుంది..అది చిరంజీవి తనయుడి కోసం అంటే పగడ్బందీగా రంగంలోనికి దిగి ఉంటాడు.
గతంలో కొందరు ఇలాంటి చిత్రాలు వదులుకుని ఆ చిత్రాలు వేరే వాళ్లు తీయడంతో పాటు విజయం సాధించడంతో అర్రె ఆ చిత్రం చేయలేక పోయానె అని బాధపడిన సంధర్బాలు చాలా ఉన్నాయి. మరి కమ్ముల చిత్రానికి మగధీర యస్ అంటాడో నో అంటాడో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications