స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల సినిమా?

ఇంతవరకు ఆయన డైరెక్షన్‌లో చేయడానికి వెంకటేష్, మహేష్ ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వచ్చినా ఇంతవరకు అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆయన మరో స్టార్ హీరోతో ఆయన పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆ హీరో కథ విన్నాడని బల్క్ గా డేట్స్ ఇవ్వటానికి రెడీ అవుతన్నాడని తెలుస్తోంది. పూర్తి స్ధాయిలో కన్ ఫర్మ్ అయ్యేదాకా ఆ హీరో పేరు బయిట పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు వెళ్లనున్నది. కానీ ఇన్నాళ్ళూ కొత్త హీరోలను డీల్ చెయ్యటానికి అలవాటపడిన శేఖర్ పూర్తి గా కమర్షయల్ హీరోను ఎలా డీల్ చేస్తాడో చూడాలంటున్నారు. గతంలో యోలేటి చంద్రశేఖర్ కూడా తన రెగ్యులర్ పద్దతిని బ్రేక్ చేసి గోపీచంద్ ని 'ఒక్కడున్నాడు' కోసం సీన్ లోకి తెచ్చి ఫ్లాప్ ఇచ్చాడు. మరి శేఖర్ ఏం చేస్తాడో చూడాలంటున్నారు.


Click it and Unblock the Notifications











