గోదావరి విడుదల ఒక వారం వాయిదా
ఒకనాటి ఎన్నారై శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన గోదావరి సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ సినిమా ఈనెల 11నే విడుదల కావలసి ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఒక వారం వాయిదా పడినట్టు చెబుతున్నారు. అనంద్ సినిమాతో సంచలనం సృష్టించిన శేఖర్ కమ్ముల గోదావరి సినిమా తీయడానికి దాదాపు ఏడాదికిపైగా తీసుకున్నారు. ఆయన డ్రీం టీం కమలినీ ముఖర్జీ, సంగీత దర్శకుడు రాధాకృష్ణన్ ఈ సినిమాలోనూ ఉన్నారు. గోదావరి మరుసటి రోజు మరో చెప్పుకోదగిన సినిమా మహా విడుదల అవుతోంది. ప్రేమిస్తే, బాయ్స్ వంటి సినిమాలు తీసిన భరత్ సినిమా ఇది. ఈ సినిమా తమిళ వెర్షన్ బాగా నడుస్తోంది.


Click it and Unblock the Notifications