గోదావరి విదేశీ హక్కులు కెఎడి....
ఆనంద్ ఫేం శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం గోదావరి త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా విదేశీ ప్రదర్శన హక్కులను కెఎడి ఎంటర్‌టైన్‌మెంట్స్, టూరింగ్ టాకీస్- యుఎస్‌ఎ సంస్ధలు సంయుక్తంగా చేజిక్కించుకున్నాయి. కెఎడి సంస్ధ గతంలో ఎన్నో విజయవంతమైన తెలుగు సినిమాలను విదేశాల్లో ప్రదర్శించింది. టూరింగ్ టాకీస్- యుఎస్‌ఎను శేఖర్ కమ్ముల చిరకాల మిత్రుడు మనోహర్‌రెడ్డి ప్రమోట్ చేశారు. 2004 చివర్లో చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ మూడు వందల ప్రింట్లతో విడుదల కాగా, ఆనంద్ మూడు ప్రింట్లతో విడుదలై సైలెంట్‌గా మంచి విజయం సాధించింది. ఆనంద్ విదేశాల్లో ముఖ్యంగా ఉత్తర అమెరికాలో పెద్ద సక్సెస్ అయింది. గోదావరి సినిమాలో సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. ఈ సినిమా ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయమే పట్టినప్పటికీ బాగా వచ్చింద ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications