శేఖర్ కమ్ముల కొత్త చిత్రం రిలీజ్ డేట్
హ్యాపీడేస్ అనంతరం శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లీడర్ చిత్రం డిసెంబర్ ఇరవైనాలుగున రిలీజ్ కానుంది.క్రిస్ మస్, సంక్రాంతి పండుగలను ఈ చిత్రం టార్గెట్ చేయనుంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రాణాని హీరోగా పరిచయం అవుతూండటంతో మంచి అంచనాలే ఉన్నాయి. అంతేగాక ఈ చిత్రాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్ధ ఎవియం ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో రిలీజ్ నవంబర్ ఇరవై నాలుగున ప్లాన్ చేసారు.హ్యాపీడేస్ కు సూపర్ హిట్ సంగీతం అందించిన మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి పనిచేసారు. ఇక ఈ చిత్రం లోగోని నవంబర్ ఒకటిన లాంచింగ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో రాణా సరసన ప్రియ ఆనంద్ మరియు రిచా హీరోయిన్స్ గా చేస్తున్నారు.
శేఖర్ కమ్ముల ఆనంద్ హ్యాపీడేస్ రాణా సురేష్ బాబు లీడర్ మిక్కీ.జె.మేయర్ ప్రియాఆనంద్ రిచా rana suresh babu anand shekar kammula godavari happydays


Click it and Unblock the Notifications