ఇంతకీ ఆ సినిమాలో మహత్తు ఏమిటి...!?
'లీడర్" సినిమాలో నటించిన వేళా విశేషం ఏమిటో గానీ అందులో హీరో హీరోయిన్లుగా నటించిన వారందరికీ బాలీవుడ్ టికెట్ లభించింది. లీడర్ సినిమా పూర్తి కాకముందే అందులో హీరో అయిన రాణాకి దమ్మారో దమ్ అనే హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
రీసెంట్ గా రిచా గంగోపాధ్యాయకి అమీషా పటేల్ నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రాగా, అందులో మరో నాయికగా నటించిన ప్రియా ఆనంద్ కూడా బాలీవుడ్ వెళ్లిపోతోంది. నిజానికి ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టి ఉండేవాడే. హ్యాపీడేస్ హిందీ రీమేక్ కి అంతా సిద్దమయ్యాక కూడా ఎందుకో ఆగిపోయింది. దాంతో శేఖర్ కమ్ముల తిరిగి తెలుగుకొచ్చి ఓ ఇంగ్లీష్ టైటిల్ తో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పాలని చూస్తున్నారు. రేపో మాపో ఇతనూ బాలీవుడ్ వెళ్లడం ఖాయం కనుక, లీడర్ ముహోర్త బలంలోనే ఏదో మహత్తు ఉందని అనుకోవాలి.


Click it and Unblock the Notifications











