twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సెన్సార్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: లీడర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్న శేఖర్ కమ్ముల త్వరలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నసంగతి తెలిసిందే. హ్యపీడేస్ తరహాలో పూర్తి యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

    శుక్రవారం ఈచిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేశారు. శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని వండర్ ఫుల్‌గా రూపొందించారని సెన్సార్ బోర్డు సభ్యులు మెచ్చుకున్నారు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రాన్ని సెప్టెంబర్ 14 విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    'కొంచెం అమాయకత్వం, మరికొంచెం గందరగోళం, ఆహ్లాదం, అనుభూతులు... ఇలా అన్నీ మిళితమైన కథాంశమిది. ఈ చిత్రం ద్వారా అక్కినేని అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండగా, హీరోయిన్ శ్రియ సెక్సీ లుక్‌తో ఇందులో కనిపించనుంది. అదే విధంగా చాలా కాలంగా తెరమరుగైన హీరోయిన్ అంజలా జవేరి ఈచిత్రంలో గెస్ట్ పాత్రలో నటించనుంది.

    కొత్త నటీనటులైన అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జార, రస్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను స్టార్ కాంటెస్ట్ ద్వారా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఆర్ట్: తోట తరణి, నిర్మాతలు: శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

    English summary
    Sekhar Kammula's upcoming movie 'Life is Beautiful' was censored on Friday and was awarded the movie clean U certificate. 'Life is Beautiful' will be hitting the theaters worldwide from September 14.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X