కలర్ ఫుల్ గా ముస్తాబవుతున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
ఆనంద్, గోదావరి చిత్రాలతో క్లాస్ ప్రేక్షకుల్ని, హ్యాపీడేస్ తో యూత్ ని ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల లీడర్ తో అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొంత గ్యాప్ తర్వాత అందరూ కొత్తవారితో ఖేఖర్ రూపొందిస్తున్న 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ప్రస్తుతం సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. 'ఆనంద్" కూడా పద్మారావునగర్ లో వేసిన హౌస్ సెట్ లో షూటింగ్ చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో అక్కడే చాలా భాగం షూట్ చేస్తున్నారు.
శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను చేస్తున్నాడు. హ్యాపిడేస్ తరహాలోనే ఈ చిత్రం కోసం రాష్ట్రవ్యాప్తంగా స్టార్ హంట్ నిర్వహించి కొత్త ఆర్టిస్టులను ఎంపిక చేశారు. ఆనంద్ తో క్లాస్ చిత్రాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన శేఖర్ ఈ తర్వాత హ్యాపీడేస్ తో టోటల్ గా తెలుగు సినిమా ట్రెండ్ నే మార్చేశారు. ఆ తర్వాత తెలుగులో హ్యాపీడేస్ తరహా సినిమాలు వందల్లో వచ్చాయి. ఇప్పుడు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" అంటూ శేఖర్ చేస్తున్న ఈ సినిమా మరో ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశఆలు కనిపిస్తున్నాయి...


Click it and Unblock the Notifications











