Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సాయి పల్లవి, శేఖర్ కమ్ముల మరో వండర్.. లవ్ స్టొరీ తెలుగులోనే కాదు.. అక్కడ కూడా
ఫిదా సినిమా అనంతరం చాలా గ్యాప్ తరువాత శేఖర్ కమ్ముల చేసిన సినిమా లవ్ స్టొరీ. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి - నాగ చైతన్య కలిసి నటించిన లవ్ స్టొరీ ఇప్పటికే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. చూస్తుంటే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మరో వండర్ క్రియేట్ చేసేలా ఉందని టాక్ వస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ తో చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది.
ఆ సినిమాతో అగ్ర దర్శకుడిగా
సాయి పల్లవితో ఇదివరకే ఫిదా సినిమా చేసిన శేఖర్ కమ్ముల ఏ స్థాయిలో హిట్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో ఆయన కూడా స్టార్ దర్శకులతో సమానంగా మార్కెట్ సెట్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల అంటే ఒక బలమైన బ్రాండ్ అని ఈజీగా అర్థమయిపోయింది.
మిగతా భాషల్లో కూడా
నాగ చైతన్య - సాయి పల్లవి ఇద్దరికి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక శేఖర్ కమ్ముల గురించి తెలిసిందే. అయితే సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని డిసైస్ అయ్యారు. స్పెషల్ గా ప్రమోషన్ కూడా చేయనున్నారట.
మళయాళంలో కూడా
కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ మలయాళంలో కూడా సినిమా రానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. మలయాళంలో అయితే సాయి పల్లవికి భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. సొంత లాంగ్వేజ్ కాబట్టి కంటెంట్ వారికి కనెక్ట్ అయితే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం కాయం.
క్లిక్కయితే..
ఇక కన్నడలో నాగ చైతన్య సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అక్కడ డైరెక్ట్ తెలుగు సినిమాలే ఒక రేంజ్ లో వసూళ్లను అందుకుంటాయి. ఇక డబ్ చేసి విడుదల చేస్తే మరో లెవెల్లో హిట్టవుతాయి. మరి శేఖర్ కమ్ముల మ్యాజిక్ ఆ భాషల్లో ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఒకవేళ క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద వండర్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.