శేఖర్‌ కమ్ముల కొత్త చిత్రంలో నటించాలనుందా?

By Srikanya

కొత్తవాళ్ళను పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రం రూపొందించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే రూటులో వెళ్తూ.. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కూడా నూతన నటీనటులను పరిచయం చేయాలని ప్లాన్ చేసారు. ఈ విషయమై శేఖర్...మాట్లాడుతూ..లీడర్‌ తరవాత ఎలాంటి కథ చేయాలి? అని ఆలోచించాను. మళ్లీ 'ఆనంద్‌', 'హ్యాపీడేస్‌'లాంటి సినిమా కావాలి అనిపించింది. వాటిలో జీవితం గురించి చెప్పాం. ఆ అనుభూతుల్ని మరోసారి చూపిద్దాం అనిపించింది. స్టార్స్‌ తో సినిమా తీయొచ్చు. కానీ ఈ కథకి కొత్తవాళ్లయితే బావుంటుంది. అందుకే ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల కోసం అన్వేషిస్తున్నాం. సిక్స్‌ప్యాక్ ‌లూ, ప్రపంచ సుందర్లూ అక్కర్లెద్దు. కథకు సరిపడేలా సహజంగా ఉంటే చాలు అన్నారు. కాబట్టి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే...ఫోటోలు, బయోడేటాలతో [email protected] సంప్రదించండి. లేకుంటే ఒడాఫోన్ స్టోర్స్ లో కూడా అఫ్లికేషన్స్ దొరుకుతాయి. ఇంకా డిటైల్డ్ గా వివరాలు కావాలంటే...www.amigoscreations.com వెబ్ సైట్ చూసేయండి. బెస్టాఫ్ లక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X