twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయతార-శేఖర్ కమ్ముల ‘అనామిక’ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ మూవీ 'కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న 'అనామిక' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు/తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన స్టిల్స్ విడుదలయ్యాయి. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    బాలీవుడ్ మూవీ 'కహానీ'లో విద్యా బాలన్ పోషించిన పాత్రను ఇందులో నయనతార పోషిస్తోంది. .. కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ చిత్ర కథ. ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు.

    అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    ప్రియమణి గెస్ట్ రోల్...

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో హీరోయిన్ ప్రియమణి అతిథి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గెస్ట్ రోల్ చేయడానికి ప్రియమణి ఒప్పుకుందని, ప్రియమణిపై త్వరలో కొన్ని సీన్లు చిత్రీకరించడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

    నిర్మాతల వివరాలు

    ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    పాతబస్తీ బ్యాక్ డ్రాప్‌లో...

    కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

    శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..

    ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు.

    English summary
    Sekhar Kammula's Anamika to release this Dussehra. MM Keravani garu composing music for this film. Film Nagar source said that Sekhar Kammula has roped in Priyamani for a guest appearance in hid next film Anamika. Rumour mill is that Priyamani has given her nod for Sekhar Kammula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X