శేఖర్ కమ్ముల 'అనామిక' రిలీజ్ ఎప్పుడంటే...
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. దసరా సందర్భంగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు.
నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.
హిందీలో వచ్చిన 'కహానీ'కి ఇది రీమేక్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చార్మినార్, సుల్తాన్ బజార్, ముర్గి మార్కెట్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నారు. ఆర్ట్ డైరక్టర్ చిన్నా నేతృత్వంలో దుర్గామాత సెట్ ని పద్మారావు నగర్ లో వేసి చిత్రీకరిస్తున్నారు. వైభవ్, పశుపతి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్.


Click it and Unblock the Notifications












