శేఖర్ కమ్ముల కొత్త చిత్రం విడుదల తేదీ ఖరారు
శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని తొలుత జనవరి 26, 2012న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ముందుగా అనుకున్న సమయానికి విడుదల సాధ్యం కాక పోవడంతో ఫిబ్రవరి 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శేఖర్ కమ్ముల కొత్త వారిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.
సాధారణంగా శేఖర్ కమ్ముల చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఈ చిత్రం కూడా అదే తరహాలో ఉంటుందని అంటున్నారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఎక్కవ శాతం షూటింగ్ హైదరాబాద్ చుట్టు పక్కల జరుపుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రొడక్షన్ పనులకు సిద్ధం అవుతోంది. ఇది వరకు తాను దర్శకత్వం వహించిన 'లీడర్' చిత్రం అనుకున్న అంచనాలు చేరుకోక పోవడంతో...ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు శేఖర్ కమ్ముల.


Click it and Unblock the Notifications











