శేఖర్ కమ్ముల అభిమానులు శుభవార్త
ఓ హీరోకు ప్యాన్స్ ఉన్నట్లో,శేఖర్ కమ్ములకు సైతం అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నా తన తాజా చిత్రంతో సంక్రాంతికి వచ్చేస్తున్నారు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తో అందరూ కొత్త వాళ్లతో ఆయన రూపొందించే ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది.ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంభందించి ఓ స్టిల్ కానీ,టీజర్ కానీ విడుదల చేయకపోయినా మంచి క్రేజ్ ఉంది. ఈ కొత్త తరహా ప్రేమకథని ఆయన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.ఈ విషయమై శేఖర్...మాట్లాడుతూ..లీడర్ తరవాత ఎలాంటి కథ చేయాలి? అని ఆలోచించాను. మళ్లీ 'ఆనంద్', 'హ్యాపీడేస్'లాంటి సినిమా కావాలి అనిపించింది. వాటిలో జీవితం గురించి చెప్పాం. ఆ అనుభూతుల్ని మరోసారి చూపిద్దాం అనిపించింది. స్టార్స్ తో సినిమా తీయొచ్చు. కానీ ఈ కథకి కొత్తవాళ్లయితే బావుంటుంది. అందుకే ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల కోసం అన్వేషిస్తున్నాం. సిక్స్‌ప్యాక్ లూ, ప్రపంచ సుందర్లూ అక్కర్లెద్దు. కథకు సరిపడేలా సహజంగా ఉంటే చాలు అన్నారు.ఇక ఈ చిత్రం కూడా యువతరాన్ని టార్గెట్ తీసారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











