twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల కొత్త చిత్రం విడుదల వాయిదా

    By Srikanya
    |

    శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'ని జనవరి 26న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం విడుదలను పిబ్రవరి మొదటి వారంలోకి మార్చారని సమాచారం. అంటే పిబ్రవరి మూడవ తేదిన ఈ చిత్రం విడుదల చేయనున్నారు. మొదటి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసారు కానీ సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ ఉండటంతో ఈ చిత్రం విడుదల వాయిదా వేసారు. ఇక 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో అందరూ కొత్త వాళ్లతో ఆయన రూపొందించే ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది.ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంభందించి ఓ స్టిల్ కానీ,టీజర్ కానీ విడుదల చేయకపోయినా మంచి క్రేజ్ ఉంది.

    ఈ విషయమై శేఖర్...మాట్లాడుతూ..లీడర్‌ తరవాత ఎలాంటి కథ చేయాలి? అని ఆలోచించాను. మళ్లీ 'ఆనంద్‌', 'హ్యాపీడేస్‌'లాంటి సినిమా కావాలి అనిపించింది. వాటిలో జీవితం గురించి చెప్పాం. ఆ అనుభూతుల్ని మరోసారి చూపిద్దాం అనిపించింది. స్టార్స్‌ తో సినిమా తీయొచ్చు. కానీ ఈ కథకి కొత్తవాళ్లయితే బావుంటుంది. అందుకే ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల కోసం అన్వేషిస్తున్నాం. సిక్స్‌ప్యాక్ ‌లూ, ప్రపంచ సుందర్లూ అక్కర్లెద్దు. కథకు సరిపడేలా సహజంగా ఉంటే చాలు అన్నారు.ఇక ఈ చిత్రం కూడా యువతరాన్ని టార్గెట్ తీసారని తెలుస్తోంది.

    English summary
    Sekhar Kammula's new love story, Life Is Beautiful planning to release in the first week of February.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X