twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ట్యాగ్ లైన్ ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ :'' 'ఆనంద్'కు 'మంచి కాఫీలాంటి సినిమా' అనే ఉపశీర్షిక పెట్టాను. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'కి అలాంటి ట్యాగ్‌లైన్లు లేవు కానీ... 'ఇది మన సినిమా' అని మాత్రం చెప్పుతున్నాను. మనసున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ''పరీక్షలు రాశాం. ఫలితం ఎలా ఉంటుందో మాకు తెలుసు. తప్పకుండా విజయం సాధించి తీరుతాం'' అని శేఖర్‌కమ్ముల చెప్పారు.

    అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను తెరకు పరిచయం చేస్తూ శేఖర్‌కమ్ముల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. డీటీయస్ ఫైనల్ మిక్సింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేఖర్ మాట్లాడారు.

    అలాగే...''అయిదేళ్ల క్రితం 'హ్యాపీడేస్' రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఆ సినిమా విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో... ఇప్పుడు అంతకంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సంగీత పరంగా మిక్కీ జె.మేయర్ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. తోట తరణి కళాదర్శకత్వం, విజయ్ సి.కుమార్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె.వెంకటేష్ కూర్పు ఈ చిత్రానికి ప్రధాన బలాలు అన్నారు. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నటించే అవకాశం రావడం పట్ల అభిజిత్, సుధాకర్, కౌశిక్, రష్మీశాస్త్రి ఆనందం వ్యక్తం చేశారు. అమిగోస్ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా రూపొందుతోంది.

    ఇక "స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఓవర్‌సీస్‌లో కూడా భారీ స్థాయిలో విడుదల ఉంటుంది. నైజాం ప్రాంతానికి 'దిల్'రాజు విడుదల చేస్తున్నారు. సీడెడ్, కర్నాటక 'ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేయనున్నారు. తెలుగు సినిమాల్లోనే రికార్డు స్థాయిలో అమెరికాలో 55 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఇక విజయలక్ష్మీ ఫిలింస్ ద్వారా ఆంధ్రాలో విడుదల కానుంది. వారం ముందు నుంచే విడుదలయ్యే ప్రతి థియేటర్ వద్ద ఆడ్వాన్స్ బుకింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం డీటీఎస్ ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది'' అని తెలిపారు.

    English summary
    
 Sekhar Kammula’s ‘Life is Beautiful’ relesing on 14 of this month with Manchi Cinema tag line. It is going to be the biggest ever US release for a Telugu film, with more than 55 centers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X