రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి సాయి పల్లవి పడిపోయిందట..
ఫిదా చిత్రంతో సాయి పల్లవి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. ఫిదా రిలీజ్ తర్వాత భానుమతి పాత్ర చాలా పాపులర్ అయింది. అంతేకాకుండా ఆమె చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. భానుమతి పాత్ర తెర మ
ఫిదా చిత్రంతో సాయి పల్లవి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. ఫిదా రిలీజ్ తర్వాత భానుమతి పాత్ర చాలా పాపులర్ అయింది. అంతేకాకుండా ఆమె చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. భానుమతి పాత్ర తెర మీద గొప్పగా కనిపించడానికి సాయి పల్లవి పడిన కష్టాన్ని దర్శకుడు శేఖర్ కమ్మలు ఇటీవల వివరించారు.
ఫిదా చిత్రంలో సాయిపల్లవి చాలా కష్టపడింది. కదిలే రైలు ఎక్కడం, దిగడం, పొలాల్లో ట్రాక్టర్ నడపడం లాటి కష్టమైన పనులను నేర్చుకొన్నది. ఇంటర్వెల్ సీన్‌లో ట్రైన్ నుంచి దూకుతూ నిజంగానే కింద పడిపోయింది. ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. ముందుగా రాసుకున్న కథ ప్రకారం ఇంటర్వెల్‌కు ముందు రైలు కంపార్ట్‌మెంట్‌లో వరుణ్ మాటలు విన్న భానుమతి స్టేషన్‌లో ప్లాట్‌ఫాం పైకి దిగి ఏడుస్తుంది. అప్పుడు రైలు కదిలితే పరిగెత్తుతూ రన్నింగ్ ట్రైన్‌ను ఎక్కాలి.

ఆ సన్నివేశంలో సాయి పల్లవి నిజంగానే పడిపోవడంతో మోకాళ్లు కొట్టుకుపోయాయి. అయితే ఆ సీన్‌ను సినిమాలో పెట్టలేకపోయాం. ఈ రోజు ఆమెను ఇంతమంది అభిమానిస్తున్నారంటే అదంతా ఆమె కష్టమే అని శేఖర్ కమ్ముల వెల్లడించారు.


Click it and Unblock the Notifications











