సమంతకు శేఖర్ సపోర్ట్: మహేష్ ఫ్యాన్స్ ఫైర్
హైదరాబాద్: మహేష్ తాజా సినిమా '1 నేనొక్కడినే' సినిమా పోస్టర్‌పై హీరోయిన్ సమంత మండిపడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బీచ్‌లో నడుస్తుండగా హీరోయిన్ తన పాద ముద్రలను తాకుతూ పాకుతున్న పోస్టర్ మీద సమంత చేసిన కామెంట్స్‌కు మహేష్ ఫ్యాన్స్ సమంత మీద ఎదురుదాడి దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టర్ వివాదంలో సమంతకు సిద్ధార్థ్ కూడా సపోర్ట్ రావడంతో సిద్ధూ-సమంతలను ఇద్దరిపై ఫైరయ్యారు.
అయితే ఈ వ్యవహారం నాలుగు రోజుల క్రితం సద్దుమణిగింది. ఇప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ముల మళ్లీ సమంతను సపోర్ట్ చేస్తూ కొత్తగా వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ వివాదం చెలరేగుతోంది. దీనితో ఆయనపై కూడా మహేష్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. సమంతకు మద్దతు పలుకుతూ ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడే '1' నేనొక్కడినే సినిమాకు సంబంధించి హీరోయిన్ కృతిసనన్ మహేష్ వెంట గోవా బీచ్‌లో పాకుతూ వెళుతున్న పోస్టర్ చూశాను. ఇది చాలా షాకింగ్‌గా ఉంది. అంతేకాదు స్త్రీలను కించపరిచేలా ఉంది, ఈ పోస్టర్ విషయంలో సమంత వెలిబుచ్చిన అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను" అంటూ ట్విట్ చేశారు శేఖర్ కమ్ముల.
అంతేకాదు ఈ పోస్టర్ విషయంలో సమంత ఒక మహిళలా ప్రతిస్పందించిది కాని మహేష్ బాబుకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదని శేఖర్ సమంతను సమర్ధిస్తున్నాడు. ఇటువంటి పోస్టర్లు సినిమాలలో చూడటం ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు శేఖఱ్ కమ్ముల.
ఈ వ్యవహారంతో నేరుగా సుకుమార్‌కి, మహేశ్‌బాబుకి సంబంధం లేకపోయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఇది చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











