హీరో రాజశేఖర్ పరిస్ధితి అంతలా దిగజారిపోయిందా?
అప్పట్లో వరసగా సెక్స్ ఓరియెంటెడ్ సి గ్రేడ్ సినిమాలు వరసగా తీసిన నిర్మాత నట్టికుమార్. ప్రస్తుతం ఆయన చిన్న సినిమాలకు దేముడుగా మారాడు. ఆగిపోయిన సినిమాలను, మిగలిపోతున్న దర్శకులకు ఆయన పెద్ద దిక్కే ఒడ్డిక్కిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన రాజశేఖర్ తో మా అన్నయ్య బంగారం చిత్రం నిర్మించారు. రాజశేఖర్ హీరోగా చేసిన ఆ చిత్రం పెద్ద ప్లాప్ గా మిగిలింది. అయితే మ్రొక్కువోని ఉత్సాహంతో నట్టికుమార్..అదే హీరో రాజశేఖర్ ని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రం తమ విశాఖ టాకీస్ పతాకంపై నిర్మించటానికి రెడీ అవుతున్నారు. 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'త్రీ'...చిత్రాల దర్శకుడు శేఖర్ సూరి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు. ఇక ఈ చిత్రంలో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రను పోషిస్తారు. ఈ సందర్బంగా నట్టికుమార్ మాట్లాడుతూ "శేఖర్ సూరి తయారు చేసిన స్క్రిప్ట్ చాలా బాగుంది. రాజశేఖర్ పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకొంటాయి. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తాం. యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. 20 రోజుల పాటు బ్యాంకాక్ లో చిత్రీకరణ చేస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ"న్నారు. ఇక చిత్రానికి మాటలు: సురేంద్రకృష్ణ, ఛాయాగ్రహణం: రమేష్‌కృష్ణ, సంగీతం: విజయ్ కుర్రాకుల.అంటే రాజశేఖర్ కి బయిట నిర్మాతలు ఎవరూ రాకే నట్టికుమార్ తో కంటిన్యూ అవుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











