'ఎ ఫిల్మ్ బై అరవింద్' సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన దర్శకుడు శేఖర్ సూరి. ఆయన తన తదుపరి థ్రిల్లింగ్ సినిమాకి 'త్రి' అనే టైటిలు పెట్టి ఆసక్తి రేపుతున్నారు. బాలీవుడ్ హాట్ గర్ల్ ఊర్వశి శర్మ హీరోయిన్ గా చేస్తోన్న ఈ సినిమాలో అరవింద్ కాంబినేషన్ (రాజీవ్ కనకాల, రుషి) రిపీట్ అవుతున్నారు. రాజ్ ఇండియా ఎంటరటైన్ మెంట్స్ బ్యానర్ పై ఫణి దీన్ని నిర్మిస్తున్నారు. ఆయనకి 'ఎ ఫిల్మ్ బై అరవింద్' సినిమా అంటే చాలా ఇష్టంట.ఆయన తన మిత్రులకు ఆ సినిమా డి.వి.డీలు పంపిణీ చేసాడట.ఈ విషయం తెల్సుకుని శేఖర్ సూరి ఎప్రోచ్ అవగానే కథ కూడా అడగకుండా ఓ.కె చేసాడట.కాబట్టి త్రి గ్యారీంటీగా ఆయన నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అంటున్నారు.అలాగే శేఖర్ ఆలోచనలను సరిగా అర్ధంచేసుకుని ఆర్ .ఆర్ అందించిన సంగీత దర్శకుడు విజయ్ కూరాకుల మళ్ళీ ఈ టీమ్ తో కలసి పని చేయటం మరో ప్లస్ అంటున్నారు.జూన్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి సింధిల్, భాస్కర్ ఛాయా గ్రహణం అందిస్తున్నారు.
Story first published: Tuesday, April 21, 2026, 16:57 [IST]