ఆనంద్ వంటి రొమాంటిక్ కామిడితో తెలుగు వారిని ఉర్రూతలూగించిన శేఖర్ కమ్ముల,రొమాంటిక్ కింగ్ అని ముద్ర వేసుకున్న నాగార్జున కాంబినేషన్ కి రంగం సిద్దమవుతోంది. ఈ మధ్యనే నాగార్జునని కలిసిన శేఖర్ కమ్ములకి ఆయన మెగా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు పదినెలల పాటు రెండు వేల తొమ్మిదిలో డేట్స్ కేటాయిస్తాననట్లు సమాచారం. దాంతో్ హ్యాపీడేస్ హిందీ రీమేక్ వెర్షన్ ని శేఖర్ కమ్మల వాయిదా వేసుకోనున్నట్లు సిని వర్గాల సమాచారం. స్వయంగా నాగార్జునే ఈ ఓపెన్ ఆఫర్ తో రావటం శేఖర్ కి ఆనందం కల్గించినా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.ఇక నాగార్జున కూడా 2009లో ఏ సినిమాను ఒప్పుకోలేదు. ఈ వారమే నాగార్జున కింగ్ కూడా రిలీజ్ కానుంది.