అభిమానులకు అల్లరి నరేష్ ఆఫర్

By Srikanya

హైదరాబాద్ : అల్లరి నరేష్ సినిమాకు టైటిల్ పెట్టే అవకాసం ప్రేక్షకులకే ఇస్తున్నారు చిత్ర నిర్మాత అమ్మిరాజు కానుమల్లి. అల్లరి నరేష్ కు ట్విన్ సిస్టర్ గా రంగం ఫేం కార్తీక నటిస్తున్న చిత్రానికి నాటుబాంబు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి టైటిల్స్ పరిశీలుస్తున్నారు. ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అల్లరి నరేష్ తన అభిమానులనుంచే టైటిల్ ను ఎంపిక చేయాలని భావించి ఈ అవకాసం ఇస్తున్నారు.

1. నాటు బాంబు (నవ్వులు పేలుతాయి)

2. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి.

ఈ పైన చెప్పిన రెండు టైటిల్స్ లో ఏది బాగుంటుంది అనిపిస్తుందో ఆ టైటిల్ ని...

[email protected]

ఈమెయిల్ ఎడ్రస్ కి మెయిల్ చెయ్యండి

లేదా..
www.facebook.com/AllariNaresh కి వెళ్లి ఓటు చేయండి... ఏ టైటిల్ కి ఎక్కువ ఓట్లు వస్తాయో దాన్నే ఫైనలైజ్ చేస్తారు.

Select a title for Allari Naresh’s next

ఈ సినిమాను సిరి సినిమా పతాకంపై నిర్మాత అమ్మిరాజు నిర్మిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఆడియో ఈనెలాఖరున విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ సినిమాకి పాటలు భాస్కరభట్ల రాయగా, కెమెరా-విజయకుమార్, ఫైట్స్-రామ్‌లక్ష్మణ్ సమకూరుస్తున్నారు. వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ తల్లిదండ్రులుగా సురేఖావాణి, కాశీవిశ్వనాధ్‌లు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X