»   » బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ అంటే నాకు పిచ్చి : మనసు విప్పిన హీరోయిన్

బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ అంటే నాకు పిచ్చి : మనసు విప్పిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన వీక్నెస్ ని తానె బయట పెట్టుకుంది. తాను ఎప్పుడూ బ్యాడ్ బాయ్స్ తోనే డేటింగ్ చేయడానికి ఇష్టపడతాననీ.,గతంలో కూడా చాలా మంది బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ చేశానని మారీ క్లేరీ మేగజైన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ షాక్ కి గురి చేసిందీ అందాల సింగర్

కొద్దికాలం కిందటే ఈ పాప్ అందగత్తె సెలెనా గోమెజ్‌ తన లవర్ "జస్టిన్ బీబర్‌" కు బ్రేకప్‌ చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే బీబర్ ను టార్గెట్ చేస్తూ అతన్ని ఉడికించటానికే ఈ వ్యాఖ్యలు చేసిందా? లేక ఆ తర్వాత మరెవరితోనైనా ఆమె డేటింగ్ చేస్తుందా అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.

Selena Gomez likes to date bad boys

బ్యాడ్ బాయ్స్ తన వీక్ నెస్ అనటంతో అక్కడి యువకులు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. అమీ స్కూమర్, జెన్నిఫర్ లారెన్స్ లను ప్రశంసించింది. వారు అందరు మహిళల మాదిరిగా ఉండరని, అంతకంటే ఎక్కువ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది.

సెలెనా తో బ్రేకప్ అయ్యాక జస్టిన్ బీబర్‌ మాత్రం కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేస్తుండగా, ఈ అమ్మడు మాత్రం తన మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆల్బమ్స్ కోసం ఎంతో శ్రమ పడుతున్న సెలెనా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కునే పనిలో పడిందా.. గతాన్ని మళ్లీ తవ్వుకుంటూ బాధలో ఉందా సన్నిహితులు, అభిమానులు తెలుసుకోలేక పోతున్నారు.

English summary
Selena Gomez reveals she has a 'weakness for bad boys'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu